Kashmir Lok Sabha Elections : జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటి సారి ఎన్నికలు జరుగబోతున్నాయి. అవి ఎలా ఉండబోతున్నాయి.. ఇది అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా జరుగబోతున్నాయి. మొదట ఉద్దంపూర్ లో ఎన్నిక జరుగబోతోంది. 26న జమ్మూలో ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. అనంత్ నాగ్ రాజౌరి నియోజకవర్గం ఇదొక ప్రత్యేక నియోజకవర్గం కొత్తగా క్రియేట్ చేసింది. మే 7న, శ్రీనగర్ లో మే 14న, బారాముల్ల మే 21న జరుగబోతున్నాయి. 5 నియోజకవర్గాలు 5 దఫాలుగా జరుగుబోతున్నాయి.
దీంట్లో భాగంగా అమిత్ షా 9వ తేదీన పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగించబోతున్నారు. యోగి ఆదిత్యనాథ్ 10వ తేదీన ప్రచారం చేస్తున్నారు. మోడీ 12వ తేదీన ఉద్దంపూర్ లో ప్రసంగించబోతున్నారు. ముగ్గురు హేమాహేమీలు ప్రచారం చేయబోతున్నారు.
స్మృతి ఇరానీ, హేమమాలినీ, కంగనా రనౌత్ వంటి బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. మొత్తం మీద జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో కూడా ఆకర్షనీయంగా జరుగబోతోంది. ఈసారి ఓట్ల శాతం కూడా గణనీయంగా పెరగబోతోంది.
గత ఎన్నికల్లో కశ్మీర్ లోయలో కేవలం 7 శాతం ఓట్లతో ఫరూక్ అబ్దుల్లా గెలిచాడు. ఈసారి అలా జరగదు. ఓట్లు గణనీయంగా పడుతున్నాయని ప్రజల ట్రెండ్ ను బట్టి జరుగబోతోంది.
మోడీ, యోగీ, అమిత్ షా ల పర్యటనలతో వేడెక్కిన కాశ్మీర్ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.