Janasena Formation Day : 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. “దేశం కోసం దేవుడితో కూడా యుద్ధం చేస్తా” అన్న ఆయన సిద్ధాంతం యువతను ఆకర్షించింది. తాను అప్పట్లో అధికారానికి పోటీ చేయకపోయినా, టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలో కీలకపాత్ర పోషించాడు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకమైన కూటమిని ఏర్పరచారు. టీడీపీ, బీజేపీతో కలిసి త్రిపాక్షిక సంకీర్ణాన్ని రూపొందించారు. ఈ కూటమి వైసీపీకి బలమైన ప్రత్యామ్నాయంగా మారింది. పవన్ కళ్యాణ్ మళ్లీ మాస్ లీడర్‌గా ఎదిగేందుకు, ప్రభుత్వ వ్యతిరేకతను జనసేన బలంగా వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మార్చి 14న జనసేన ఆవిర్బావ సభ పిఠాపురంలో జరుగబోతోంది. పవన్ అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయ్యాక జరుగుతున్న మొట్టమొదటి సభ ఇదీ. ఇది పవన్ సభ అంటే చాలు జనాలు తరలివస్తారు. ఈసారి మార్చి 14 చరిత్రాత్మకం కాబోతోంది. జరిగేది గోదావరి జిల్లాల్లో.. పవన్ ఇమేజ్ ప్యాన్ ఇండియా ఇమేజ్ గా మారినతర్వాత.. ఏపీ రాజకీయాల్లో పవన్ జనసేన తిరుగులేని రాజకీయ శక్తిగా మారిన తర్వాత జరుగుతోంది ఈ సభ.
పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం అనేక అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన పట్టుదల, ప్రజల కోసం పనిచేయాలనే తపన అతన్ని తిరుగులేని శక్తిగా నిలిపింది. 2024 ఎన్నికల్లో గెలిచి పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు.. మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు పవన్ కళ్యాణ్ ఒక ఆశాకిరణంగా నిలుస్తారా? అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
చరిత్ర సృష్టించి బోతున్న పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.