Nepal : నేపాల్ లో గమ్మత్తైన పరిణామాలు జరుగుతున్నాయి. 2008లో రాచరికాన్ని రద్దు చేసి రిపబ్లిక్ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. రాజు వద్దు ప్రజలే ప్రభువులు అని నినాదం ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారంటే.. మాకు రాజే తిరిగి రావాలని జనం నినదిస్తున్నారు. రాజు కావాలని పెద్ద ఆందోళన చేస్తున్నారు. మొన్న ఇద్దరు చనిపోయారు. దేశవ్యాప్తంగా రాజు రావాలని కోరుతున్నారు.ఏం జరిగింది? ఎందుకిలా చేస్తున్నారన్నది తెలుసుకుందాం.
నేపాల్ రిపబ్లిక్ ఏర్పడి 17 సంవత్సరాలు అయ్యింది. ప్రధానంగా మూడే మూడు పార్టీలున్నాయి. నేపాల్ అంతా కొండల మీద ఉంటుంది. భారత్ కు నేపాల్ కు మధ్య ప్లేన్ ఏరియా తెరాయి ఉంటుంది. వారికి అన్యాయం జరిగింది. భారత మూలాలున్న వారు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. కొండల మీద ఉన్న పార్టీల వారు ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకున్నాయి. వాళ్లే డామినేట్ చేస్తున్నారు. తెరాయి వారు నేపాల్ రాజకీయాన్ని ఏలలేకపోతున్నారు.
ఒకటి నేపాల్ కాంగ్రెస్ భారత అనుకూల పార్టీగా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ను కేపీ శర్మ ఉన్నారు. ఈయనే ఇప్పుడు నేపాల్ ప్రధాని. మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ప్రచండది మూడో పార్టీ. వీళ్లే ముగ్గురు. ఎన్నికల్లో ఒంటరిగా.. పొత్తులతో చేస్తారు. ఎన్నికలయ్యాక ఎవరు ఏ పంచన చేరుతారో ఎవరూ చెప్పడం లేదు.
నేపాల్ లో తిరిగి రాజు కావాలని జనం ఆందోళన వెనుక కారణంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో లో చూడొచ్చు.