Pawan Kalyan Sanatana Dharma : పవన్ కళ్యాణ్.. మరొక్కసారి వార్తల్లో నిలిచారు. రెండు విధాలుగా వార్తల్లో ఉంటున్నారు. డిప్యూటీసీఎంగా పవన్ కళ్యాణ్ పాలన సొంత శాఖల్లో తను వేస్తున్న ముద్ర ప్రజలు చాలా ఇంప్రెస్ అవుతున్నారు. అదే టైంలో రెండో కోణంలో మోస్ట్ వాంటెడ్ లీడర్ గా ఎమర్జ్ అవుతున్నారు. హిందూ ధర్మ పరిరక్షకుడిగా పవన్ ఎదుగుతున్నాడు.
ముఖ్యంగా దక్షిణ భారతం పవన్ ను నమ్ముతోంది. తిరుమల లడ్డూ వివాదంలో ప్రాయశ్చిత్త దీక్ష చేసి మెట్లపై నడుచుకుంటూ వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని వచ్చి ‘సనాతన ధర్మ రక్షణ ప్రసంగం’ అద్భుతంగా సాగింది. దాని మీద దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ ప్రసంగంతోనే సనాతన ధర్మం గురించి చెబుతూ దీనికి బోర్డు కావాలని నినదించాడు.
హిందూ మతంపై వివక్ష ఉండొద్దని.. సనాతన హిందూ ధర్మ రక్షణ బోర్డు అవసరం అని పవన్ డిమాండ్ చేశారు. తాజాగా మురుగన్ భక్తుల సమావేశం మధురైలో సాగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిలిచారు. అన్నామలైతో కలిసి పాల్గొన్నారు. భక్తులు కూడా పవన్ రావాలని కోరారు. దానికి ముందే పవన్ ‘స్కంధ షష్టి యాత్ర’ చేశారు. పవిత్ర ఆరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను విజిట్ చేశారు. ఆ విధంగా తమిళనాడు ప్రజలు పవన్ రావాలని కోరుకుని భక్తి చాటారు.
దక్షిణ భారత హిందూ హృదయ సామ్రాట్ పవన్ కళ్యాణ్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
