పవన్ కళ్యాణ్ రోజురోజుకు ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. ఆయన వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన ఏ విధంగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం దేశంలో పరిస్థితుల్లో జాతీయభావం, దేశం పట్ల ప్రేమ ఎలా ఉండాలో పవన్ కల్యాన్ ను చూసి నేర్చుకోవాలి.
జనసేన పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా తన అణువణువుగా దేశభక్తి, జాతీయ భావం కలిగి ఉన్న నేత పవన్ కళ్యాణ్. ఇది తెలుగువాళ్లకు మంచి ఉత్దేజాన్ని ఇచ్చే కార్యక్రమం. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆంధ్రా వాళ్ల పాత్ర చాలా కీలకం. ఇప్పుడు ఆ స్ఫూర్తిని , సామాజిక చైతన్యాన్ని పవన్ రగిలిస్తూ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.
ఇటీవల రెండు కార్యక్రమాల్లో రెండు సందేశాలు విన్న తర్వాత నాయకుడు ఇలా ఉండాలని అనిపించింది. మరుగునపడినటువంటి మహానీయులను తిరిగి వాళ్లకు ఆ స్థానాన్ని కల్పించేందుకు పవన్ పడుతున్న కృషి అభినందనీయం..
తెలుగు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని రగిలిస్తున్న పవన్ కళ్యాణ్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
