Amaravati 2.0 land pooling: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. పోలవరం,అమరావతి,స్టీల్ ప్లాంట్, లకు పునాది పడింది. సంక్షేమ పథకాలు పట్టాల పైకి ఎక్కాయి. సంవత్సరం పాలనలో పాజిటివ్ స్పందన వచ్చింది.
ఈ సమయంలో కూటమి ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. రెండో విడత అమరావతి భూ సేకరణ 40వేల ఎకరాలు సేకరించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆలోచించింది. సమీకరణ అంటే 10వేల ఎకరాలకు 40వేల ఎకరాల భూమిని తీసుకోవాలన్నది కరెక్ట్ కాదు.
రైతులకు భూములు అన్నవి గుండె కాయ.. మొదటి విడతలో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారంటే వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆరోజు దానికి అవసరం. విడిపోయిన ఏపీకి డబ్బులు లేవు. నిధులు సమకూర్చుకునే పనిలో ఆంధ్రప్రభుత్వం లేదు. దీంతో ఇన్ని ఎకరాల భూములను సేకరించేందుకు రైతులు ముందుకొచ్చారు.
అమరావతి రైతులకు ఇచ్చిన భూములకు గాను అభివృద్ధి చేసిన ప్లాట్లు వారికి ఇప్పటికీ ఇవ్వలేదు. ఆరోజు వాగ్ధానం చేసినట్టు ప్లాట్లు ఇవ్వలేకపోయాం.
ఇప్పుడు మొదలైతే ఇంకో రెండు సంవత్సరాలకు కానీ అమరావతి ప్లాట్లు వారి చేతికి రాదు. అప్పుడు నిధులు లేవు. ఇప్పుడు ఇన్ని ఎకరాలు అవసరం లేదు. ఎయిర్ పోర్ట్, స్పోర్ట్ సిటీ కోసం ఇన్ని ఎకరాల కావాలంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు..
ఆంధ్రప్రదేశ్ లో రెండోవిడత భూసమీకరణ నమూనా ఎందుకు వద్దు? దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
