పవన్ కళ్యాణ్ ఇటీవల రాజోలు పర్యటనలో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ వాళ్ల దిష్టి అని కామెంట్ చేశాడు. రాజోలులో పవన్ కళ్యాణ్ కు జననీరాజనం పలికారు. స్పందన అద్భుతంగా వచ్చింది. సభ విజయవంతంగా సాగింది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
అయితే ప్రసంగం మొత్తం బాగానే ఉంచింది. మధ్యలో కొబ్బరితోటలు నాశనమవుతున్నాయని.. తెలంగాణ దిష్టి తగిలిందని నోరుజారాడు. ఆ మాట వాడి ఉండాల్సింది కాదు.. మోడీ, చంద్రబాబు లాంటి వారే పదాలు దొర్లి వివాదాస్పదమయ్యాయి. మాట దొర్లడం అనేది మానవ సహజం.. జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం జరగాలి.
పవన్ కళ్యాణ్ అభిమానులు దానిపై కౌంటర్ అటాక్ చేస్తూ తెలంగాణ నేతలపై ఫైర్ అవుతున్నారు. తిట్టిపోస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసింది తప్పుడు వ్యాఖ్యలు. దీన్ని సరిదిద్దుకోవాలి. మాట్లాడేవారిపై కౌంటర్ అటాక్ చేయరాదు.
పవన్ కళ్యాణ్ నోట మాట దొర్లింది సవరణ వివరణ ఇవ్వాలి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.