Pakistan : పాకిస్తాన్ ఆర్మీ.. ఇప్పుడు ఆ దేశాన్ని ఒక్కటిగా ఉంచడంలో శక్తివంతంగా పనిచేసింది.మతం పేరిట రాజకీయాలు చేస్తోంది. మతం పేరిటనే బంగ్లాదేశ్ ను విడగొట్టింది. పాకిస్తాన్ లో రాజకీయ నాయకులపై కన్నా ఆర్మీపై ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. పాకిస్తాన్ ఆర్మీ మాకు రక్షణగా ఉంటుందన్న భావన పాకిస్తాన్ ప్రజలకు ఉండేది. కానీ ఇది నిన్నటి మాట..
2021లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను తొలగించడంలో పాకిస్తాన్ ఆర్మీ పాత్ర ఉంది. పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ఇళ్లలోకి చొరబడి కూడా ప్రజలు ఆందోళన చేశారు. ఈ పరిణామాల తర్వాత పాకిస్తాన్ ఆర్మీపై క్రెడిబిలిటీ ప్రజల్లో పడిపోయింది. ఆ తర్వాత 2024 ఎన్నికల తర్వాత ఎన్నికలను ప్రభావితం చేసింది ఆర్మీ అని.. ఇమ్రాన్ ను ఓడించింది పాకిస్తాన్ ఆర్మీ అని ఆరోపణలు వచ్చాయి. ఈసారి జనంలోకి బాగా వెళ్లింది.
2022 నుంచి పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. పాకిస్తాన్ సైన్యానికి ట్రస్టులు, పెట్రోల్ బంకులు, గ్యాస్ నిక్షేపాలు సహా ఇతర వ్యాపారాలు బాగా ఉన్నాయి. పై దగ్గర నుంచి కింది వరకూ పాకిస్తాన్ ఆర్మీకి అన్ని వ్యాపారాలున్నాయి. పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ లేకుండా ఏదీ లేదు.
పాకిస్తాన్ సైన్యం సంక్షోభంలో పడింది.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.