Great Nicobar Project : గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఇదీ.. దాదాపు 72వేల కోట్లతోటి ఓ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇది ఎక్కడ ఉందని చూస్తే.. అండమాన్ నికోబార్ దీవుల్లో చిట్టచివరన ఉండేది ‘గ్రేటర్ నికోబార్.’ దాంట్లో చిట్టచివరన ఉండేది ‘గలాటే బే’ అనేది చివరన ఉంటుంది. అది మన సీపోర్టుకు అనువుగా ఉంటుందని తెలిసి భారత ప్రభుత్వం ‘ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్ షిప్ నర్ పోర్టు’ను భారత ప్రభుత్వం నిర్మిస్తోంది.
ప్రపంచంలో కొన్ని అంతర్జాతీయ సముద్ర మార్గాలున్నాయి. గల్ఫ్ నుంచి చైనా, జపాన్ వరకూ ఉంటాయి. ఆ మలక్కా జలసంధి ద్వారా వెళతాయి.. ఈ జలసంధి అంతర్జాతీయ మార్గం. దీనికి అంత్యంత దగ్గరగా ఉండేదే ఈ గలాటా బే ద్వీపం.
ఇటీవల కాలంలో చైనా ఇండియన్ ఓషియన్ లో విపరీతంగా సబ్ మెరైన్లు, యుద్ధ వాహన నౌకలు తిరుగుతున్నాయి. భారత్ గనుక గ్రేటర్ నికోబర్ లో ఒక స్థావరం ఉంటే చాలా క్లోజ్ గా మానిటర్ చేయవచ్చు. ఒకటి రవాణా పరంగా.. ఇంకోటి రక్షణ పరంగా ఈ నికోబర్ దీవి భారత్ కు అత్యంత కీలకంగా మారనుంది.
భారత్ రక్షణ రవాణాకు అత్యంత కీలకం నికోబార్ ప్రాజెక్టు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.