E20 petrol mileage effect: వాహనం ఉన్న ప్రతి ఒక్కరికి పెట్రోల్ తప్పనిసరిగా కావాల్సిందే. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నా.. దీని అవసరం ఎక్కువగా ఉండడంతో డిమాండ్ కూడా పెరుగుతోంది. అయితే పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వంటి వాహనాలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే పెట్రోల్ అన్నిచోట్ల అందుబాటులో ఉండడంతో చాలామంది ఈ వాహనాలని ఎక్కువగా వాడుతున్నారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేస్తునన్నా.. బ్యాటరీ విషయంలో కాస్త వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇథనాల్ ను కూడా ప్రవేశపెడుతున్నారు. ఒకేసారి దీనిని మార్కెట్లోకి తీసుకువస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల పెట్రోల్ తో పాటు ఇథనాల్ ను కూడా యాడ్ చేసి విక్రయిస్తున్నారు. దీనిని E 20 పెట్రోల్ అంటారు. మరి దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎవరికి నష్టం కలిగించనున్నాయి?
ఇటీవల చాలాచోట్ల E 20 పెట్రోల్ బంకులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే చాలామందికి అవగాహన లేకుండా సాధారణ పెట్రోల్ అనుకొని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని ముందే వినియోగదారులకు తెలపాలని కొన్ని పెట్రోల్ బంకులు నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా కొన్ని పెట్రోల్ బంకుల సిబ్బంది ముందే E 20 పెట్రోల్ గురించి చెబుతున్నారు. అయితే ఈ పెట్రోల్ లో 80 శాతం పెట్రోల్ ఉంటే.. 20% ఇథనాల్ కలుస్తుంది. ఒక రకంగా e 20 పెట్రోల్ వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
అయితే ఈ పెట్రోల్ వల్ల కొన్ని వాహనాలకు మాత్రం సౌకర్యం కాదు అని అంటున్నారు. 2023 సంవత్సరాని కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకు E 20 పెట్రోల్ అనుగుణంగా ఉండదని చెబుతున్నారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాహనాలకు ఈ పెట్రోల్ సౌకర్యంగానే ఉంటుందని చెబుతున్నారు.ఇథనాల్ అనేది ఎథ నల్ అనే మొక్కల నుంచి తయారవుతుంది. ఇందులో చెరకు, మొక్కజొన్న వంటివి ప్రధానంగా నిలుస్తాయి. భారతదేశంలో ఇవి సమృద్ధిగా ఉండడంతో.. వీటితో తయారుచేసిన ఇంధనం మార్కెట్లోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ ఇంధనాన్ని ఒకేసారి మార్కెట్లోకి తీసుకురావడం కష్టంగా ఉంటుంది. అందువల్ల ముందుగా పెట్రోల్ లో దీనిని కలిపి విక్రయిస్తున్నారు. అయితే తమ వాహనం ఎప్పటిదో ముందుగా తెలుసుకొని ఆ తర్వాత ఈ 20 పెట్రోల్ ను వినియోగించుకోవడం మంచిది.
ఇథనాల్ పెట్రోల్ మార్కెట్లోకి రావడం వల్ల పర్యావరణానికి అనుకూలంగా ఉండడంతో పాటు.. విదేశీ చమరుపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. అయితే లేటెస్ట్ వాహనాలకు మాత్రమే ఇది అనుగుణంగా ఉంటుంది. అందువల్ల పాత వాహనాలకు ఈ ఇంధనం సరిపోదు. అంతేకాకుండా దీనివల్ల వాహనం చెడిపోయే అవకాశం కూడా ఉందని కొందరు బైక్ నిపుణులు తెలుపుతున్నారు.