Manoj Sinha 5 years of rule : కాశ్మీర్.. పహల్గాం సంఘటన ప్రతీ ఒక్కరిని కలిచివేసింది. భారత్ మొత్తం కూడా ఉద్విగ్నానికి గురైంది. దేశభక్తి అందరిలోనూ కనిపించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య. అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. కాశ్మీరీలు.. ఇదివరకు ఎప్పుడు లేనంతగా ఈరోజు పహల్గాం సంఘటన తర్వాత భారత్ తో మమేకం అయ్యి నినందించారు. జాతీయ జెండా పట్టుకొని నినదించారు. భారత సైన్యంపై రాళ్లు వేయకుండా పాకిస్తాన్ ను వ్యతిరేకిస్తూ కశ్మీరీలు వీధుల్లో నిరసనలు తెలిపారు.
పహల్గాం సంఘటన కశ్మీరీలను మానసికంగా భారత్ తో మమేకం చేసింది. పహల్గాంతో వచ్చిన సంఘటన కాదు ఇదీ. 5 ఏళ్లుగా దీని వెనుక లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కృషి చాలా ఉంది. మోడీ ఆర్టికల్ 370 రద్దు చేసినా కశ్మీరీల మనసు దోచింది మాత్రం మనోజ్ సిన్హానే.
2020లో కశ్మీర్ కు లెఫ్టినెంట్ గవర్నర్ గా వచ్చారు. కశ్మీర్ వేర్పాటువాదులు, కశ్మీర్ నేతలు అప్పటివరకూ జైల్లో ఉన్నారు. వాళ్లు బయటకు రాగానే కశ్మీర్ లోని పరిస్థితులన్నీ మనోజ్ సిన్హా మార్చేశారు. గ్రామాల బాట పట్టాడు. సమస్యలు తెలుసుకున్నాడు. డైరెక్టుగా తనతో మాటలు మాట్లాడేలా వీలు కల్పించాడు. సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలు తీర్చాడు. ఇప్పుడు కశ్మీర్ లో 365 రోజులు షాపులు తెరిచే ఉంటున్నాయి. స్కూల్లు, కాలేజీలు తెరిచి ఉన్నాయి. ఎటువంటి బంద్ లు, హర్తాళ్లు లేవు. కేవలం సైనిక చర్యల ద్వారా ఇది సాధ్యం కాదు.
ఈయన ఎమ్మెల్యే, ఎంపీ కాదు. అంతకంటే ముఖ్యంగా మనోజ్ సిన్హా కశ్మీరీల ప్రజల మెప్పు పొందాడు. 5 సంవత్సరాల పాలనలో కాశ్మీరీల మనసుల్ని మార్చిన మనోజ్ సిన్హా పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.