https://oktelugu.com/

Manipur drone attack: మణిపూర్ లో డ్రోన్లతో బాంబు పేలుళ్ళు దేనికి సంకేతం?

మణిపూర్ లో డ్రోన్లతో బాంబు పేలుళ్ళు దేనికి సంకేతం? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 3, 2024 / 09:05 PM IST

    దేశ భద్రతలో ఇప్పుడు కాశ్మీర్ లో పరిస్థితులు కుదుట పడుతున్నాయి. పాకిస్తాన్ ఎంత ఉగ్రవాదులను ఎగదోసినా కంట్రోల్ భారత్ చేతుల్లోనే ఉంది. ప్రజలు కూడా భారత్ కు అనుకూలంగా ఉన్నారు. కానీ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఈశాన్య భారతం అల్లకల్లోలంగా మారింది.

    మణిపూర్ అల్లర్లు మతపరమైన సంఘర్ణణగా చూపిస్తున్నారు. ఇది మతపరమైన ఘర్షణ కాదు.. ఇది అంతకన్నా విస్తృతమైన పథకంలో ఇది భాగమన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

    షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నప్పుడే నాలుగైదు నెలల క్రితం పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ చెప్పింది.. మార్టిన్ ఐలాండ్ కావాలని అమెరికా అన్నదని.. అది ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిందని షేక్ హసీనా తెలిపారు.

    అసలు ఈ మార్టిన్ ఐలాండ్ ఎందుకు అమెరికాకు అవసరం.. చిట్టగాంగ్ దిగువన ఉంటుంది. బంగాళఖాతంలో కీలకంగా ఉంటుంది. భారత్ విభజన వేళ పాకిస్తాన్ ను పావుగా వాడుకున్నాయి అమెరికా, బ్రిటన్ దేశాలు.. ఇండియాను దెబ్బకొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాయి.

    అయితే అమెరికాకు లొంగి ఉండకుండా ఇండియా స్వతంత్ర్యంగా విదేశీ విధానాన్ని తీసుకుంది. అటు రష్యాతో.. ఇటు అమెరికాతోనూ సఖ్యతతో ఉంటుంది. అది అమెరికాకు నచ్చడం లేదు. వారికి లొంగకపోవడమే భారత్ పై అమెరికా కోపానికి కారణం..

    మణిపూర్ లో డ్రోన్లతో బాంబు పేలుళ్ళు దేనికి సంకేతం? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.