Mamata Banerjee : మూడు రోజుల క్రితం.. కోల్ కతా లో జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలన్న ఏకైక డిమాండ్ తో జరిగింది. విశేషం ఏంటంటే.. ర్యాలీకి అందరు విద్యార్థుల కంటే ముందు జాతీయ జెండా పట్టుకొని కాషాయ జెండా పట్టుకొని నీటి ఫిరంగులను తట్టుకొని నిలబడ్డాడు. జెండానూ ఊపుతూనే ఉన్నాడు. ఆ వీడియో చూస్తే అద్భుతమైన సన్నివేశంగా చెప్పకతప్పదు.
ఈ దృశ్యం చూస్తే ఇది కదా స్వామి వివేకానంద జన్మించిన నేల.. ఇది కదా కుదీరాం భోస్ ఆత్మార్ఫణ చేసినటువంటి నేల.. ఇది కదా అరవింద్ ఘోష్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడియాడిన నేల..ఇది కదా సచ్చేంద్ర సన్యాల్ పోరాటం చేసిన నేల అనిపించకమానదు.
ఈరోజు ఓ సాధువు పోలీసులకు ఎదురెళ్లి.. వాటర్ క్యానన్స్ ను తట్టుకొని జెండాను ఊపుతూ అలానే నిలబడ్డాడు.ఆయన వయసు 70 ఏళ్ల వరకూ ఉంటుంది.
మమత ప్రభుత్వ తీరుపై బెంగాల్ లో రాజుకున్న ఉద్యమానికి ఈ నిరసనలు మచ్చుతునకగా చెప్పొచ్చు. ఈ ఉద్యమం మమతా స్వీయ రాజీనామా నా లేక రాష్ట్రపతి పాలన నా? దిశగా నడిపిస్తోంది.
బెంగాల్ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.