Aay Movie Collections : చిన్న చిత్రంగా విడుదలైన ‘ఆయ్’ 15 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

15 వ రోజు ఈ సినిమాకి దాదాపుగా 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ గా 15 రోజులకు కలిపి ఈ చిత్రం 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో మరో కోటి రూపాయిలు రాబట్టే అవకాశం ఉంది.

Written By: Vicky, Updated On : August 30, 2024 7:50 pm
Follow us on

Aay Movie Collections :  ఈమధ్య కాలం లో పెద్ద సినిమాలు తెచ్చే లాభాలకంటే చిన్న సినిమాలు తెస్తున్న లాభాలు ఎక్కువగా ఉంటున్నాయి. నిర్మాతలకు ఈ చిన్న సినిమాలు బంగారు గుడ్లు పెట్టే బాతులు లాగా మారిపోయాయి. అంతే కాకుండా టాలెంట్ ఉన్న ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే కంటెంట్ ఉన్న సినిమాలదే రాజ్యం. కంటెంట్ ఉంటే ఊరు పేరు తెలియనోడిని హీరోగా పెట్టి సినిమాలు తీసినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ఆయ్’ చిత్రాలు అందుకు ఉదాహరణలు. చిన్న సినిమాలు గా విడుదలైన ఈ రెండు చిత్రాలు ఇప్పటికీ మంచి వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతున్నాయి.

‘ఆయ్’ చిత్రం విషయానికి వస్తే ఈ సినిమాని బన్నీ వాసు నిర్మించాడు. మెగా మరియు అల్లు కుటుంబాలకు ఎంతో సన్నిహితుడైన బన్నీ వాసు ఈ చిత్రం తో నిర్మాతగా టాలీవుడ్ లో శాశ్వతంగా స్థిరపడ్డాడు. ఈ సినిమాని గోదావరి జిల్లాల్లో కేవలం కోటి రూపాయిల బడ్జెట్ నిర్మించాడు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండడంతో 3 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయింది. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై నేటితో 15 రోజులు పూర్తి అయ్యింది. ఈ 15 రోజులకు గానూ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి గానూ 4 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ వారం లో 2 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మొత్తం మీద రెండు 2 వారాలకు కలిపి 6 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఓవర్సీస్, కర్ణాటక, చెన్నై వంటి ప్రాంతాలను కలిపి చూస్తే ఈ సినిమాకి 7 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

అలాగే 15 వ రోజు ఈ సినిమాకి దాదాపుగా 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ గా 15 రోజులకు కలిపి ఈ చిత్రం 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో మరో కోటి రూపాయిలు రాబట్టే అవకాశం ఉంది. కేవలం కోటి రూపాయిల బడ్జెట్ తో సినిమా తీసి, థియేటర్స్ నుండి ఇంత వసూళ్లను రాబట్టిన బన్నీ వాసు, ఓటీటీ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా మరో 15 కోట్ల రూపాయిల లాభాల్ని అర్జించినట్టు తెలుస్తుంది. కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అంటారు కదా, దానికి ఉదాహరణ ఇదే అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.