https://oktelugu.com/

Tamil Nadu : పటిష్టమైన సామాజిక కూర్పుతో మొదటిసారి ద్రవిడ వాదానికి గట్టి పోటీ

పటిష్టమైన సామాజిక కూర్పుతో మొదటిసారి ద్రవిడ వాదానికి గట్టి పోటీపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను ఈ వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : April 3, 2024 / 02:05 PM IST

    Tamil Nadu  : తమిళనాట 1967 తర్వాత ప్రాంతీయ పార్టీలకు నిజమైన గట్టి పోటీ నెలకొంది. 1967లో కాంగ్రెస్ నుంచి డీఎంకే అధికారం దక్కించుకున్న తర్వాత అసలు జాతీయ పార్టీలకు పాత్ర లేకుండా పోయింది.

    డీఎంకే నుంచి అన్నాడీఎంకే చీలిపోయాక జాతీయ పార్టీలకు స్థానం లేకుండా పోయింది. ఎవరైతే ద్రవిడ వాదాన్ని వ్యతిరేకించే వాళ్లు ఉన్నారో అన్నాడీఎంకే వైపు ఉండేవారు. ద్రవిడవాదం మీదనే తమిళ రాజకీయాలు నడిచాయి. ద్రవిడ వాదాన్ని వ్యతిరేకించేవాళ్లు అంతా అన్నాడీఎంకే వైపే ఉండేవారు.

    2014లో రెండు ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి పోటీ చేసింది. బీజేపీ ఈ స్థాయిలో తమిళనాట బలపడలేదు. బీజేపీ తేలిపోయింది. కానీ మొట్టమొదటి సారి రెండు ద్రవిడ వాద పార్టీలకు మూడో ప్రత్యామ్మాయంగా బీజేపీ ఎదిగింది. మొట్టమొదటి సారి డీఎంకే, అన్నాడీఎంకేతో బీజేపీ గట్టి పోటీపడుతోంది.

    అయితే డీఎంకే కీలక నేతల నియోజకవర్గాల్లో వీక్ క్యాండిడేట్లను అన్నాడీఎంకే పెట్టింది. ఇక అన్నాడీఎంకే సహా కూడా ఇలానే చేసింది. ఈ ఇద్దరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా బలమైన అభ్యర్థులను నిలిపింది.

    పటిష్టమైన సామాజిక కూర్పుతో మొదటిసారి ద్రవిడ వాదానికి గట్టి పోటీపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను ఈ వీడియోలో చూడొచ్చు.