Venkatesh: విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందులో ముఖ్యంగా చింతకాయల రవి, నమో వెంకటేశా లాంటి కామెడీ సినిమాలు ఆయన రేంజ్ లో ఆడలేదు. ఎందుకంటే ఆ దర్శకులు చేసిన మిస్టేక్స్ వల్లే ఈ సినిమాలనేవి పెద్దగా ఆడలేదు. వెంకటేష్ తో కామెడీ సినిమాలు చేస్తే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల్లా ఉండాలి. కానీ ఈ రెండు సినిమాల్లో కథతో సంబంధం లేకుండా కామెడీని పండించే ప్రయత్నం చేశారు. ఇక ఈ సినిమాల్లో కథ కూడా చాలా దారుణంగా ఉంటుంది.
మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అసలు కథ ఉండదు. అందువల్లే ఈ రెండు సినిమాలు కామెడీ జానర్ లో తెరకెక్కిన కూడా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక మొత్తానికైతే వెంకటేష్ కెరియర్ లో భారీ సక్సెస్ లుగా నిలిచిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తరహాలో ఈ సినిమాలు కూడా ఆడతాయని ఊహించిన అభిమానులకు మాత్రం ఇవి భారీ నిరాశను మిగిలచ్చాయనే చెప్పాలి. అయితే ముందుగా ఈ రెండు సినిమాలు వెంకటేష్ చేయాలా, వద్దా అని బాగా ఆలోచించాడట.
కానీ కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికైనా ఆదరిస్తారు అనే ఉద్దేశంతోనే ఈ సినిమాలు చేసినట్టుగా ఒక ఇంటర్వ్యూలో వెంకటేష్ చెప్పడం విశేషం…అయినప్పటికీ ఈ సినిమాలు మాత్రం తన కెరియర్ ను ఏ మాత్రం ముందుకు తీసుకెళ్ళలేక పోగా, ఆయన మార్కెట్ ను కూడా భారీగా డౌన్ చేశాయని చెప్పాడు.
అయితే వెంకటేష్ తో ఒక మంచి కథ తో సినిమా చేయాలి కానీ ఏ జానర్ లో అయిన సరే నటించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు వెంకటేష్…మరి ఇలాంటి వెంకటేష్ ను పెట్టి నాసిరకం కథలతో సినిమాలు చేసే దర్శకులు ఇప్పటికైనా మారి ఒక మంచి కథతో సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు…