https://oktelugu.com/

Jharkhand : జార్ఖండ్ పై ఎన్నికల విశ్లేషణకు ముందు దాని స్వరూప స్వభావాల గురించి తెలుసుకుందాం

Jharkhand: ‘జార్ఖండ్’ పై ఎన్నికల విశ్లేషణకు ముందు దాని స్వరూప స్వభావాల గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2024 12:05 pm

    Jharkhand : జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలు జరుగబోతున్నాయి.. జార్ఖండ్ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. జార్ఖండ్ పుర్వరంగం.. స్వరూపం , రాజకీయం తెలుసుకుందాం.. జార్ఖండ్ హిందీ బెల్ట్ లో భాగంగా ఉంది. కానీ ఇది విభిన్నమైన రాష్ట్రం.. చాలా వైవిధ్యమున్న రాష్ట్రం. విపరీతంగా ఫారెస్ట్, కొండలు ఉన్న రాష్ట్రం.. ఖనిజాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా జార్ఖండ్. కానీ వీటిని తవ్వి తీసింది చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ ఆదివాసీలు తమ హక్కుల కోసం బలమైన పోరాటం చేయడంతో ఈ ఖనిజాల తవ్వకం ఆగిపోయింది.

    ఆదివాసీలకు భూ సమస్య చాలా ఇంపార్టెంట్. మొత్తం జనాభాలో ఆదివాసీలు 26 శాతం ఉన్నారు. కానీ వారి ప్రభావం చాలా ఎక్కువ. ఇది మా రాష్ట్రం అన్న భావన ఎక్కువ. ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఆదివాసీలను పెట్టకుండా ఓబీసీలను పెట్టడం వారిలో ఆగ్రహావేశాలకు కారణమైంది.

    నాలుగు కీలక తెగలున్నాయి. సంతాల్ తెగ ఇంపార్టెంట్. రాష్ట్రపతి కూడా సంతాల్ తెగ ఆదివాసీనే.. ‘ఓరాన్, ముండా, పో’ అనేవి నాలుగు కీలక తెగలు. సంతాల్ అతిపెద్ద తెగ. ఓడిషాలో కూడా ఈ తెగ ఉంది. పశ్చిమ బెంగాల్ లో కూడా వీరు ఉన్నారు. దేశంలో భిల్ అనే తెగ పెద్ద జనాభాలో మొదటిది కాగా.. సౌత్ ఈస్ట్ లో గుజరాత్, రాజస్థాన్, ఉత్తర మహారాష్ట్రలో ఉన్నారు.తర్వాత ‘గోండు’ తెగ దండకారణ్యంలో ఉన్నారు. తెలంగాణలో కూడా వీరు ఉన్నారు. మూడోది సంతాల్ తెగ.

    ‘జార్ఖండ్’ పై ఎన్నికల విశ్లేషణకు ముందు దాని స్వరూప స్వభావాల గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    జార్ఖండ్ పై ఎన్నికల విశ్లేషణకు ముందు దాని స్వరూప స్వభావాల గురించి తెలుసుకుందాం | Jharkhand Elections