Tamil Nadu: స్కూళ్ళలో కుల కొట్లాటలపై జస్టిస్ చంద్రు నివేదిక వివాదాస్పదం

Tamil Nadu: ఇక స్కూళ్ళలో కుల కొట్లాటలు పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిపై జస్టిస్ చంద్రు నివేదిక వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : June 22, 2024 11:46 am

తమిళనాట దారుణాతి దారుణాలు సాగుతున్నాయి. అక్రమ మద్యంతో ఘోర కలి జరుగుతోంది. నిన్నటికి నిన్న 39 మంది పేదలు బలి అయిపోయారు. ఇంకో 24 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 120 మంది పరిస్థితి విషమంగా ఉంది.

విల్లుపురం జిల్లాలో ఈ దారుణం జరిగింది. అక్రమ మద్యంతో ఈ దారుణం చోటు చేసుకుంది. చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలు అక్రమ మద్యానికి నిలయాలుగా మారాయి.

ఏ రాజకీయ నాయకుల ఫ్యాక్టరీలు లేకుండా.. అధికారుల ప్రమేయం లేకుండా ఇవి జరుగుతున్నాయా? అన్నది ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. అక్రమ మద్యం సాధారణంగా మద్యపాన నిషేధం ఉన్న చోట.. మద్యం లభ్యం కాని చోట ఈ అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుంది.

తమిళనాడులో ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. 1000 కు పైగా షాపులున్నాయి. అక్కడే అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుంది. ప్రైవేటు షాపులకు వేలం వేసి అమ్ముతున్న మనలాంటి రాష్ట్రాల్లో అక్రమ మద్యం దందా సాగడం లేదు. కానీ ప్రభుత్వం మద్యం అమ్మే చోటనే ఈ అక్రమ దందా సాగుతోంది.

అక్రమమద్యంతో డీఎంకే నాయకులు వందలాది కోట్లు సంపాదిస్తున్నారు. ఆన్ లైన్ ట్రాన్షక్షన్ లతో సంబంధం లేకుండా క్యాష్ ద్వారానే ఈ దందా సాగుతోంది.

ఇక స్కూళ్ళలో కుల కొట్లాటలు పెద్ద ఎత్తున సాగుతోంది. దీనిపై జస్టిస్ చంద్రు నివేదిక వివాదాస్పదమైంది. ఈ ఘటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.