Gita Parayanam in Kolkata : కోల్ కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ కొత్త రికార్డును సృష్టించింది. ఈ గ్రౌండ్ కు చారిత్రక నేపథ్యం ఉంది. ఇది రెడ్ బ్రిగేడ్ గా ఉండేది. ఎర్రజెండాలతో లక్షలాది మందితో ర్యాలీలు, ప్రసంగాలు జరిగేవి. ముఖ్యంగా జ్యోతిబసు ప్రసంగాలకు లక్షలాది మంది తరలివచ్చేవారు. అటువంటిది తరువాత దశలో మమతా బెనర్జీ బ్రేక్ చేసింది.
ఇలాంటి బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో మొన్న జరిగిన సాధువుల ‘ఐదు లక్షల గొంతుకలతో గీతా పారాయణం’ నిర్వహించారు. సనాతన సంస్కృతి సంస్థ సాధువుల సంస్త నిర్వహించింది. లక్షలాది మందితో కోల్ కతా బ్రిగేడ్ గ్రౌండ్ లో ఎంతో వైభవంగా నిర్వహించింది.
ఎర్రజెండాల రెపరెపల నుంచి కాషాయ జెండాల రెపరెపల వరకూ ఈ సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ , నేపాల్ నుంచి ఈ సమావేశానికి రావడం విశేషం. బెంగాల్ లో ఇది కొత్తగా అనిపించొచ్చు. కానీ బెంగాల్ లో ఇది కొత్త కాదు.. స్వామి వివేకానంద పుట్టిన ప్రదేశం , చైతన్య మహా ప్రభు, రామకృష్ణ పరమంస పుట్టిన ఈ బెంగాల్ లో ఇది జరగడం గొప్ప విషయంగా చెప్పొచ్చు.
కాషాయ జెండాల రెపరెపలు రాబోయే బెంగాల్ ఎన్నికల మార్పుకి చిహ్నమా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.