Lokesh Kanagaraj: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు… వాళ్ళందరూ ఇప్పుడు ఫామ్ లో లేకపోవడం వల్ల తమిళ్ ఇండస్ట్రీ కొంతవరకు వెనుకబడిపోయింది. ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్ లలో లోకేష్ కనకరాజు లాంటి దర్శకుడు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు… కమల్ హాసన్ తో చేసిన ‘విక్రమ్’ సినిమాతో తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ను పరిచయం చేసిన లోకేష్ ఆ తర్వాత లియో సినిమాను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
ఇక రజనీకాంత్ తో చేసిన ‘కూలీ’ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందని అతను భావించినప్పటికి ఆ సినిమాలో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో ఆ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. తమిళంలో ఓకే అనిపించుకున్నప్పటికి తెలుగులో మాత్రం చాలా వరకు డీలా పడిపోయింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా ద్వారా లోకేష్ మార్కెట్ భారీగా తగ్గిపోయింది.
ప్రస్తుతం అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు భయపడుతున్నారు… పాన్ ఇండియాలో టాప్ పొజిషన్ లోకి వెళ్లిన లోకేష్ ఒక్కసారి పాతాళానికి పడిపోవడం పట్ల పలువురు సినిమా మేధావులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆయన కూలీ సినిమా విషయంలో లైట్ తీసుకున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన కంటెంట్ ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకొని దాన్ని స్క్రీన్ మీద బెటర్ గా ప్రజెంట్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ మారిపోయేది.
ఆ ఒక్క తప్పు వల్ల ఆయన సైతం చాలా వరకు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది…ఇక రాబోయే సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తే తప్ప లోకేష్ మరోసారి పాన్ ఇండియాలో తన సత్తాను చాటుకోలేడు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో స్టార్ హీరోలు సైతం అతనికి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. ఇక ఇలాంటి సందర్భంలో తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అనేదే చర్చనీయాంశంగా మారింది…