RAM TALK: ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదురుతున్న ఈ బహుముఖ ఒప్పందం ఒక “గేమ్ చేంజర్” అని విశ్లేషకులు భావిస్తున్నారు. వాణిజ్యంతో మొదలైన ఈ బంధం, ఇప్పుడు రక్షణ మానవ వనరుల మార్పిడి వైపు మళ్లడం గమనార్హం.
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న యూరోపియన్ దేశాలకు భారత్ ఒక సురక్షితమైన, భారీ మార్కెట్‌గా కనిపిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా రెండు ప్రాంతాల మధ్య సుంకాలు తగ్గి, ఎగుమతులు దిగుమతులు గణనీయంగా పెరగనున్నాయి.
సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా భారత్‌లో రక్షణ పరికరాల తయారీకి ఈయూ సహకారం అందించనుంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత కోసం ఇరు పక్షాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది రష్యా, చైనాల వ్యూహాలకు ఒక దీటైన సమాధానంగా మారనుంది.
వాణిజ్యం తో పాటు కీలకం కాబోతున్న రక్షణ నైపుణ్య వలసలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
