కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది. సహజంగానే బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శించాయి. ఎవరు అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు తీవ్రంగా దునమాడుతారు. అందులో వ్యతిరేకించడానికి లేదు.
ఇది ఎన్నికల తర్వాత వస్తున్న మొట్టమొదటి బడ్జెట్. దీనిపై అంచనాలు ఎక్కువగా వేసుకున్నారు. ఐటీ రిలాక్స్, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతారని ఊదరగొట్టారు. ఎన్నికల తర్వాత వచ్చిన బడ్జెట్ లోనూ మోడీ సర్కార్ ఆలోచనలు అమలవుతాయి.
ఎన్నికల ముందర బడ్జెట్ లో మోడీ ఎలాంటి తాయిలాలు ప్రకటించలేదు. ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. పాత బడ్జెట్ లో ద్రవ్యలోటు 5.1 నుంచి 4.9కు తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్ణయించారు.
రెండోది మౌళిక సౌకర్యాలకు పెద్దపీట వేశారు.. 11 లక్షల 11 వేల కోట్లను దీనికోసం కేటాయించారు. రాష్ట్రాలు ముందుకొస్తే 1.1 లక్షల కోట్లను మౌళిక వసతులకు కేటాయించేందుకు తాయిలాలు ప్రకటించారు.
నిర్మలమ్మ కొత్త బడ్జెట్ ఎలావుంది? అది భారతదేశానికి ఎలా మేలు చేయనుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.