Engineer Rashi : జమ్మూకశ్మీర్ లో మొదటి దఫా ఎన్నికలు ఈనెల 18న జరుగబోతున్నాయి. ఊహించిన దానికన్నా భిన్నంగా అక్కడ పరిస్థితి ఉంది. రోజురోజుకు రాజకీయాలు మారిపోతున్నాయి.
సౌత్ కశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది. అలానే ఈశాన్య జమ్మూ ఇక్కడ కూడా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇక్కడే మొదటి దఫా జరుగుతోంది. మొన్ననే రెండు రోజుల క్రితం ర్యాలీ జరిపారు. ఉగ్రవాదులను, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీని చీల్చి చెండాడాడు. అమిత్ షా మూడు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.
జమ్మూలో ఆశ్చర్యకరపరిణామం ఏం లేదు. బీజేపీ వర్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్+కాంగ్రెస్ పోటీ ఉంది. జమ్మూలో బీజేపీ గెలవడం ఖాయం. కశ్మీర్ వ్యాలీలో నిన్న ఎన్నికల ఒప్పందం కుదిరింది. అవామీ ఇతిహాద్ పార్టీ ఇవాళ జమాత్ ఇస్లామీ సంస్థ మధ్య సంప్రదింపులు జరిగాయి. జమాత్ ఇస్లామీ ఇండిపెండెంట్లను నిలబెట్టారు. అక్కడ రషీద్ పార్టీ మద్దతు ఇస్తారట.. మిగతా కశ్మీర్ లో జమాత్ ఇస్తామీ వాళ్లకు మద్దతు ఇస్తుందట..
ఈ రెండూ వేర్పాటు వాద సంస్థలు.. ఉగ్రవాదులతో జమాత్ ఇస్లామీకి డైరెక్ట్ సంబంధాలున్నాయి.పాక్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయి.
రషీద్ ఇంజనీర్ జమాత్ ఇస్లాం ఎన్నికల ఒప్పందంతో మారుతున్న రాజకీయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.