Rahul Gandhi : నెహ్రూ కుటుంబం ఇంతటి ఆత్మరక్షణలో ఎప్పుడూ లేదు. గాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబంగా ఎలా మారిందో అందరికీ తెలిసిందే.. గాంధీ పేరు మార్చుకున్నంత మాత్రాన ఆయన వారసులు అయిపోరు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీల మీద ఏ రోజు కూడా దేశద్రోహం ఆరోపణలు రాలేదు. అధికారం కోసం తప్పులు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. నెహ్రూ ప్రధానిగా కశ్మీర్, చైనా విషయంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరా గాంధీ పార్టీని కుటుంబ పార్టీగా మారడం.. ఎమర్జెన్సీ విధించడం మైనస్. రాజీవ్ గాంధీపై బోఫోర్స్ కుంభకోణం వచ్చింది. ఇందిరా, రాజీవ్ గాంధీలు ఉగ్రవాదుల చేతుల్లో బలైపోయారు. వారిపై దేశద్రోహం ఆరోపణలు రాలేదు. సోనియా పై కూడా రాజకీయ ఆరోపణలున్నాయి..
2008లో సోనియా, రాహుల్ కలిసి బీజింగ్ వెళ్లి చైనా కమ్యూనిస్టు పార్టీతో ఎంవోయూ చేసుకోవడం.. ఈరోజుకు రహస్యంగా ఉండడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2008లో జరిగిన ఒఫ్పందం.. ఇప్పటికీ బహిర్గతం చేయకపోవడం ఏంటన్నది అంతుబట్టడం లేదు.
రాహుల్ గాంధీ అమెరికా సహా యూరప్ వెళ్లినప్పుడు పాకిస్తాన్ అనుకూల గ్రూపులను కలిసి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తే ఇది దేశద్రోహం కిందనే అని చెప్పక తప్పదు..
అమెరికా నిధులపై ఎన్నో సందేహాలు సమాధానాలు కావాలి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.