పల్లె పండుగ 2.0 .. పంచాయితీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదలశాఖ, అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపిస్తున్నాడు. పవన్ ముందు..పవన్ తర్వాత ప్రజలు ఈ శాఖలను గుర్తిస్తున్నారు. ఆయన సెలబ్రెటీ కాబట్టి వచ్చిందని అనొచ్చు.కానీ పవన్ చేస్తున్న పనితీరు.. సమస్యలను లోతుగా అధ్యయనంచేయడం.. పారదర్శకంగా నిబద్దతతో చేయడం వల్ల ఈ ప్రాధాన్యత వచ్చింది.
ఈశాఖలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ పవన్ వచ్చాక చేసిన పనులతో అభివృద్ధి సాధ్యమైంది. కేంద్రం, రాష్ట్రం వాటాతో చేస్తున్న పనులను అమలు చేసి సాగిస్తున్న ఈ అభివృద్ది ప్రజలకు ఎంతోమేలు చేకూర్చింది.
అధికార యంత్రాంగం.. జిల్లాల్లో కూడా.. అవినీతి లేకుండా ఉండదు. కానీ ఇప్పుడు పవన్ శాఖల్లో లంచాలు తీసుకోవడానికి భయపడుతున్నారు. పవన్ అలా కాదు.. పవన్ శాఖలో లంచాలు తేలితే అధికారుల తాట తీస్తానని స్పష్టం చేశారు.
పల్లె పండుగ 2.O తో గ్రామీణ రోడ్లకు మహర్దశ.. పవన్ చేస్తున్న అభివృద్ధిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
