https://oktelugu.com/

Kerala : సీపీఎం ని కుదిపేస్తున్న బీజేపీతో రహస్య మంతనాలు

సీపీఎంని కుదిపేస్తున్న బీజేపీతో రహస్య మంతనాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2024 / 03:02 PM IST

    Kerala : కేరళ సీపీఎం చాలా ఆత్మరక్షణలో పడ్డాయి. దిక్కుతోచని పరిస్థితిలోకి దిగజారింది. సీపీఎం క్యాడర్ కోలుకోలేని షాక్ కు గురయ్యారు. కేరళలో ప్రధాన పార్టీలుగా కాంగ్రెస్, సీపీఎం ఉన్నాయి. బీజేపీ ఒక భూతంలాగా వారిద్దరికి ఉంది. అందుకే బీజేపీని గెలవనీయకుండా ఈ రెండు పార్టీలు అధికారాన్ని చెరోసారి పంచుకుంటూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.

    బీజేపీని కేరళలో అడుగుపెట్టకుండా రెండు పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ముస్లింలను మత ప్రాతిపదికన వాడుకుంటున్నారు. పార్లమెంట్ లో బీజేపీతో భేటి అయిన కాంగ్రెస్ ఫంట్ ఎంపీ ప్రేమ్ చంద్ పై సీపీఎం గట్టి అలిగేషన్స్ మోపింది. బీజేపీకి అమ్ముడుపోయాడని సీపీఎం ఆరోపించింది.

    ఈనెల 23న నందకుమార్ అనే పవర్ బ్రోకర్ రెండు విమర్శలు చేశారు. అనిల్ అంటోనీ, బీజేపీ నేత శోభా మీద అవినీతి ఆరోపణలు చేశారు. దానికి శోభ కౌంటర్ ఇచ్చేసింది. సీపీఎం నాయకులు బీజేపీ నేతలతో రహస్య మంతనాలు జరిపారని శోభా బయటపెట్టింది. బీజేపీ నేత జవదేకర్ తో సంప్రదింపులు జరిపినట్టు తెలిపింది. బీజేపీలోకి రావడానికి సీపీఎం నేతలు జరిపిన మంతనాల బాగోతాలను బయటపెట్టడం సంచలనంగా మారింది.

    సీపీఎంని కుదిపేస్తున్న బీజేపీతో రహస్య మంతనాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.