Cooperative Sector : సహకార రంగం.. కోఆపరేటివ్ సెక్టర్ భారత్ లో జనానికి కనెక్ట్ అయిన సహకార రంగం ఎప్పటి నుంచో ఉంది. ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉంది. ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలు వాళ్లే ధాన్యం కొనేవారు.. ఎరువులు పంపిణీ చేసేవారు. ఇప్పుడు అది దశ దిశ లేకుండా పోయింది.
ఇప్పుడు దీన్ని సంస్కరించడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దాంట్లో భాగంగానే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని ప్రత్యేక మినిస్ట్రీని ఏర్పాటు చేశారు. అమిత్ షాకు అప్పగించారు. దాన్ని చాలా ఇంపార్టెంట్ గా ముందుకు తీసుకెళుతున్నారు. గుజరాత్ లో బాగా అమలు చేస్తున్నారు. ముందు డిజిటలైజేషన్ చేస్తున్నారు.

కేంద్రం అన్ని కోఆపరేటివ్ సొసైటీలను అనుసంధానం చేసి అన్నింటిని డిజిటలైజేషన్ ను చేస్తున్నారు. దీనికోసం మోడీ సర్కార్ నిధులు ఇస్తోంది. ఈ ఏడాది నేషనల్ కోఆపరేషనల్ పాలసీని తీసుకొస్తున్నారు. ఇప్పటికీ దేశంలో కోఆపరేటివ్ సొసైటీలు 8 లక్షలకు పైగా సొసైటీలున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా లేవు. 28 కోట్ల మంది సభ్యులున్నారు. అన్ని రంగాలు ఇందులో ఉన్నాయి.
దేశంలో సహకార రంగం ఎలా విస్తరిస్తుందో తెలుసుకుందామా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.