BC Reservations Dharna: బీసీ ధర్నా.. పెద్ద ప్రహసనంగా నడిచింది. హైదరాబాద్ నుంచి ఇంత మంది నాయకులు ఖర్చులు.. రాను పోనూ ఖర్చులు.. ఢిల్లీలో తిరగడానికి ఖర్చులు.. వెరసి లక్షలాది మంది కాంగ్రెస్ తెలంగాణ నాయకులు వెళ్లి బీసీ ధర్నా అంటూ చేపట్టి ప్రహసనంగా మార్చారు.
ఢిల్లీలో ఏం సాధించారని ధర్నా చేపట్టారు. రాజకీయ పార్టీగా మీకు స్పష్టత ఉండాలి. బీసీ రిజర్వేషన్లు 50 శాతం కల్పించాలంటే సుప్రీంకోర్టు తీర్పు అడ్డు వస్తుందని రేవంత్ సహా కాంగ్రెస్ నాయకులకు తెలుసు. వీరి ధర్నా వల్ల మోడీ భయపడి బీసీ రిజర్వేషన్లు పెడుతాడా? ధర్నా వల్ల ఏం సాధించలేరన్న సంగతి కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు.
కేవలం రాహుల్ కు భజన చేయడానికి.. రాహుల్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. మరి ఏం సాధించారు దీనివల్ల అని చూస్తే.. శూన్యం.
రాహుల్ గాంధీ ప్రధాని ఏమోగానీ రేవంత్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
