Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల తదనంతరం జరుగుతున్న పరిణామం ఆశ్చర్యగొలుపుతోంది. రిజర్వేషన్ విధానాన్ని సవరించాలని పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. స్వయానా శ్రీనగర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్లమెంట్ సభ్యుడు సయ్యద్ రుహుల్లా మెహబూబ్ పెద్ద లేఖ రాశారు.
ఒమర్ అబ్దుల్లాకు ఈ లేఖలో రిజర్వేషన్లు అధికారంలోకి వస్తే సమీక్షిస్తామని చెప్పారని.. ఇప్పుడు దాన్ని అమలు చేయాలని ఎంపీ డిమాండ్ చేస్తున్నాడు. ఇంకోకతను వహీద్ అనే పీడీపీ ఎమ్మెల్యే కూడా అసలు రిజర్వేషన్ల పాలసీని స్క్రాప్ చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీనగర్ మేయర్ ఎన్సీ జునాయడ్ మట్టు కూడా మీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చినవే అమలు చేయాలని కోరారు. రిజర్వేషన్ ప్రస్తుత విధానాన్ని మార్చాలని కోరుతున్నారు.
దీనిపై కాంగ్రెస్ వైఖరి ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకమా? అనుకూలమా? కాశ్మీర్ లో రిజర్వేషన్లను మార్చాలని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.