https://oktelugu.com/

Lucky Bhaskar Collections : బ్రేక్ ఈవెన్ కి అతి చేరువలో ‘లక్కీ భాస్కర్’..కానీ ఆ ప్రాంతంలో భారీ నష్టాలు..4 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇవే!

ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల రూపాయలకు జరిగింది. మరి విడుదలైన నాలుగు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టింది..?, బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత వసూళ్లు రావాలి?, నష్టాలు వచ్చే ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 07:23 PM IST

    Lucky Bhaskar Collections

    Follow us on

    Lucky Bhaskar Collections : మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ తెలుగు చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఈ దీపావళి కానుకగా విడుదలై , బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’, ‘సీతారామం’, ‘కల్కి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి అత్యంత చేరువైన దుల్కర్ సల్మాన్ కి మన మర్కెట్స్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల రూపాయలకు జరిగింది. మరి విడుదలైన నాలుగు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టింది..?, బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత వసూళ్లు రావాలి?, నష్టాలు వచ్చే ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము.

    నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి నాలుగు రోజుల్లో 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ లో కోటి 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో భారీ నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. విడుదలకు ముందే సీడెడ్ ప్రాంతంలో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 2 కోట్ల 50 లక్షలకు జరిగింది. మొదటి రోజు తర్వాత ఈ ప్రాంతంలో ‘లక్కీ భాస్కర్’ కి వచ్చిన వసూళ్లు చాలా తక్కువ. నేటి నుండి క్లోజింగ్ వేసుకోవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వసూళ్లు ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. కోస్తాంధ్ర లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు నాలుగు కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నాలుగు రోజుల్లో ఈ సినిమాకి 11 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కోసం మరో 3 కోట్ల రూపాయిలు రాబట్టాల్సిన అవసరం ఉంది.

    ఇక మిగిలిన ప్రాంతాల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కేరళలో 8 కోట్ల 75 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటకలో 2 కోట్ల 65 లక్షలు, తమిళనాడు లో 3 కోట్ల 40 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి రూపాయిలు, ఓవర్సీస్ లో 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 48 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూళ్లు, 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల రూపాయలకు జరిగింది. బ్రేక్ ఈవెన్ కి కేవలం నాలుగు కోట్లు మాత్రమే అవసరం ఉంది. ఈరోజు, రేపటి లోపు ఆ మార్కుని అందుకొని లాభాల్లోకి ఈ సినిమా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో ఎంత దూరం వస్తుందో చూడాలి.