BRS vs Congress కే కేశవరావు .. తిరిగి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏమీలేదు. ఈయన ఒకనాడు కాంగ్రెస్ కు పీసీసీ అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు ఆయన చేసే వంక ఏంటంటే… నేను చనిపోయే ముందు ‘కాంగ్రెస్ నాయకుడి’గా చనిపోవాలని కేకే అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది. డీఎస్ కూడా ఇదే మాట చెప్పాడు.
వీళ్ల జీవితమే కాంగ్రెస్ లో ఉంది. బీఆర్ఎస్ లో 10 ఏళ్లు అధికారంలో ఉండి.. దానిద్వారా వ్యక్తిగతంగా లాభం పొంది.. రెండుసార్లు రాజ్యసభ ఇచ్చారు. కేసీఆర్ తర్వాత రెండోస్థానం ఇచ్చారు. వాళ్ల అమ్మాయిని ఏకంగా జీహెచ్ఎంసీ మేయర్ ను చేశారు. వాళ్ల అబ్బాయి హత్య కేసులో ఇరుక్కుంటే సేవ్ చేసి నామినేటెడ్ పోస్ట్ కూడా కట్టబెట్టారు. కేశవరాజు రాజకీయ చరిత్ర ఇదీ..
కేసీఆర్ పక్కన కూర్చోవడం తప్పితే కేశవరావు నోరు తెరిచింది ఎప్పుడు..కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా వెలుగు వెలిగిన కేశవరావు బీఆర్ఎస్లోకి రాగానే నోరు కట్టేసుకున్నాడు. ఎందుకోసం… దానం నాగేందర్ కూడా సైలెంట్ అయ్యాడు. వీళ్లిద్దరూ అవకాశవాదులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కేసీఆర్ పై ఇప్పుడు విమర్శిస్తున్న నేతలు కేకే, దానం లా తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.