పదవీ వ్యామోహం ఎలా ఉంటుందో ఓ కుటుంబాల చరిత్ర ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. కథనాయకుడు సినిమాలో ఎన్టీఆర్ హీరోగా.. నాగభూషణం విలన్ గా నటించాడు. ‘పెళ్లాం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా నో టెన్షన్ కానీ పదవి లేకుండా నాయకుడు ఉండలేరు’ అని నాడు చెప్పిన డైలాగ్ ఎంతో పేలింది.
పంచాయితీ ఎన్నికల్లో ఇప్పుడు తల్లి, తండ్రి, కొడుకు,కూతురు, భార్యలు అందరూ పోటీచేస్తున్నారు. కేరళలోనూ సీపీఐ, సీపీఎం గా విడిపోయిన సందర్భాల్లో ఒకే కుటుంబంలో పోటీచేశారు.
కరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి ఇద్దరూ బావ, బావమరుదులు.. ఒకాయన కమ్యూనిస్టు, ఒకాయన కాంగ్రెస్. వారిద్దరి సిద్ధాంతాలు వేరు అయినా వ్యక్తిగతంగా కలిసి మెలిసి బంధువులుగా ఉండేవారు.
ఇప్పుడు ఎటువంటి సిద్దాంతాలు లేవు. అధికార దాహం కోసం సొంత చెల్లెలు, అక్కలను దూరం పెట్టడమే కాదు.. వారి క్యారెక్టర్లను దెబ్బతీస్తున్నారు నాయకులు. మన అందరికీ తెలిసిన వారు వైఎస్ జగన్, షర్మిల.. కేటీఆర్ , కవిత..
అధికార దాహంతో అక్కచెల్లెళ్లని దూరం పెట్టిన అన్నాతమ్ముళ్ళు పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.