Revanth Reddy viral video: రీసెంట్ గానే ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ(Messi) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy తో ఫుట్ బాల్ ఆడిన విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఈ వీడియో గురించి ఇప్పుడు చర్చ. సీఎం రేవంత్ రెడ్డి గోల్ కొట్టడం, అందుకు మెస్సీ చప్పట్లు కొట్టడం, ఆ తర్వాత మెస్సీ ఫుట్ బాల్ ని నేరుగా పోడియం వద్ద కూర్చున్న అభిమానుల వైపు కొట్టడం, సీఎం రేవంత్ రెడ్డి కూడా అలా కొట్టే ప్రయత్నం చేయగా, అది గ్రౌండ్ లో ఉన్న పోలీస్ వ్యక్తికి తగలడం వంటివి జరిగాయి. వీటిపై సోషల్ మీడియా లో ఫన్నీ మీమ్స్ కూడా చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక వీడియో మాత్రం వివాదాలకు దారి తీస్తోంది. గ్రౌండ్ లో ఉన్న మెస్సీ ని కలుసుకునేందుకు ప్రముఖ రాజకీయ నాయకులకు మరియు సినీ సెలబ్రిటీలకు సంబంధించిన కొడుకులు, మనవళ్లు వచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ కూడా ఈ ఫుట్ బాల్ మ్యాచ్ ని వీక్షించడానికి వచ్చాడు. మీడియా తన చెల్లి ఫోటోలను తీస్తున్న సమయం లో ఆయన తన చెల్లిని కాపాడుకుంటూ చెయ్యి అడ్డు పెట్టిన వీడియో బాగా వైరల్ అయ్యాయి. అయితే అయాన్ మెస్సీ ని కలవడానికి గ్రౌండ్ లోకి వచ్చాడని, ఆ సమయం లో సీఎం రేవంత్ రెడ్డి అతన్ని పక్కకు వెళ్ళమని నెట్టాడని సోషల్ మీడియా లో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజెన్స్ రేవంత్ రెడ్డి తన మనవడిని అయితే మెస్సీ తో కలిపించి ఫోటోలు దిగినచ్చాడు కానీ, అల్లు అర్జున్ కొడుకు ని మాత్రం పక్కకు నెట్టేశాడు, ఇదెక్కడి న్యాయం అంటూ నెటిజెన్స్ సీఎం రేవంత్ రెడ్డి ని ట్యాగ్ చేసి నిలదీస్తున్నారు.
కానీ అసలు విషయం ఏమిటంటే ఆ వీడియో లో ఉన్నది అల్లు అర్జున్ కుమారుడు కాదు , కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానా రెడ్డి మనవడు అట. చూసేందుకు లావు గా, బొద్దుగా ఉండడం తో అందరూ అతన్ని అల్లు అర్జున్ కుమారుడని పొరపాటు పడ్డారు. ఎవరి కుమారుడైనా సరే, ఇలా ఒకరికి ఒకలా ట్రీట్మెంట్ ఇచ్చి, మరొకరికి మరోలా ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, రేవంత్ రెడ్డి ని ఈ ఒక్క విషయం లో తప్పుపట్టడంలో తప్పు లేదంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని చూసి మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
Why PAN India Super Star Allu Arjun’s son being mistreated and pushed away from Messi??
Why does Revanth Reddy Grandson get VIP treatment??#GOATIndiaTour #AlluArjun #MessiInHyderabad pic.twitter.com/xRygdOpaQH
— Dasam Sandeep (@DasamSandeepBRS) December 14, 2025