Uttar Pradesh : రామ్, రేషన్, శాసన్ యూపీలో బీజేపీ గెలుపు గుర్రాలు

రామ్, రేషన్, శాసన్ యూపీలో బీజేపీ గెలుపు గుర్రాలుగా మారుతాయా? లేదా? అన్నది ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 21, 2024 3:45 pm

Uttar Pradesh : 5వ విడత ఎన్నికలు అయిపోయాయి. ఈ 5వ విడతలో ఎక్కువమంది మాట్లాడుకున్నది రాయ్ బరేలీ ఎన్నికల గురించే.. ఇక్కడ రాహుల్ గాంధీ పోటీచేయడంతో ప్రాముఖ్యత వచ్చింది. ఇదొక ప్రివేలేజ్ నియోజకవర్గంగా చూశారు.

మీడియాలో మాత్రం సేఫ్ సీట్ కాబట్టి రాహుల్ గాంధీ రాయ్ బరేలీలో పోటీచేశారని విశ్లేషకులు అన్నారు. అయితే సేఫ్ సిటీ గా ఒకప్పుడు ఉన్నా.. యోగీ, మోడీ వచ్చాక చేసిన అభివృద్ధితో రాయ్ బరేలీ బీజేపీకి ఫేవర్ మారుతుందని అంటున్నారు.

రాయ్ బరేలీలో మొత్తం 5 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో 4 సమాజ్ వాదీ గెలవగా.. ఒకటి బీజేపీ గెలిచింది. 2019లో కాంగ్రెస్ ఇక్కడ రెండు అసెంబ్లీ సీట్లు గెలవగా.. 2022లో సున్నా సీట్లు .. అక్కడ కాంగ్రెస్ ఒక్క సీటును గెలవలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ కు కేవలం 13.2శాతం మాత్రమే ఓటు బ్యాంకు వచ్చింది.

రాయ్ బరేలీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు తగ్గుతూ రాగా.. బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వచ్చింది. గ్రౌండ్ లెవల్ చూస్తే 2019లో దినేష్ ప్రతీప్ సింగ్ అనే బీజేపీ ఎంపీ అభ్యర్థి జనంతో ఉన్నారు. జనం సమస్యలు పరిష్కరిస్తూ యాక్టివ్ గా ఉన్నారు. ఈసారి బీజేపీ ఆయనకే టికెట్ ఇచ్చారు. ఈసారి రాహుల్ గాంధీ ఖచ్చితంగా దినేష్ ప్రతాప్ చేతిలో ఓడిపోవడం ఖాయమంటున్నారు.

రామ్, రేషన్, శాసన్ యూపీలో బీజేపీ గెలుపు గుర్రాలుగా మారుతాయా? లేదా? అన్నది ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.