Home: సాహిత్యం, సంగీతం లేకుండా మనిషి ఉండకూడదని పలువురు పండితులు చెబుతుంటారన్న సంగతి తెలిసిందే. పాటలు పాడాల్సిన పని లేదు..వినగలిగితే చాలట.. అలా చేయలేని పక్షంలో వారిని మనుషులుగా పరిగణించరని అంటుంటారు. అలాగే నార్మల్ గా ఏదైనా వస్తువు చేజారితే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. ఏదైనా పని చేయాలనుకున్న సమయంలో ఆటంకాలు ఎదురైతే అశుభం అని భావిస్తుంటారు. ఇంతకీ ఇదేందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి.
ప్రతి ఇంటిలో కష్టాలు, సుఖాలు అనేవి సర్వసాధారణం. ఈ మేరకు లైఫ్ లో చెడు ఎదురైనా దానికి సంబంధించిన సంఘటనలు చోటు చేసుకోవడం అనేది ఎవరూ ఆపలేనిది. వద్దనుకున్నా కొన్ని కొన్ని ఘటనలు జరుగుతుంటాయి.. అయితే మానవ జీవితంలో ఎదురయ్యే చేదును రసమయం చేస్తే బావుంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ఇంటిలో ఏదైనా దుఖం కలిగితే చేదు ఘట్టాలు ఉండే నాటకాలు, కావ్యాలు ఉన్న పుస్తకాలను చదవాలట. ఆ విధంగా చదివితే మనకు కలిగిన దుఖం పోతుందని చెబుతున్నారు. అంతేకాదు మనకు కలిగిన కష్టం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుందంట.
కావ్యాలు, భారత రామాయణాల్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి.. వాటిని ఇంటిలోని భార్యాభర్త దుఖ: ఘట్టాలను చదవాలని తెలియజేస్తున్నారు. అలా చదవడం, వినడం వలన మనకు కలిగిన బాధ పోతుందంట. దీనికి కారణం సాహిత్యంకు ఉన్న ప్రయోజనం. అందుకే సాహిత్యం, సంగీతాలను వినగలిగితే చాలట. అవేమీ మనకు రావాల్సిన పని లేదు.
అదేవిధంగా జీవితంలో భార్యాభర్తకు సర్దుకుపోయే గుణం ఉండాలని పండితులు పేర్కొంటుంటారు. కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నారు. చేదు ఘటనలు చోటు చేసుకున్న, అశుభం జరిగినా దాన్ని తగ్గించుకోవాలి. ఎంత వద్దనుకున్నా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓపికగా ఉండాలని.. దుఖానికి సంబంధించిన పుస్తకాలను చదవడం లేదా ఆ గాథలను తెలుసుకోవడం వలన ఆ బాధ నుంచి బయట పడొచ్చని తెలియజేస్తున్నారు.