Bihar election 2025 boycott : బీహార్ ఎన్నికలు మొదలు కాకముందే ఎన్నికల వ్యవస్థనే బూటకమని.. ఎన్నికలు ఇప్పటికే దొంగిలించబడ్డాయని ప్రతిపక్షాలు ఓ పథకం ప్రకారం మొదలుపెట్టాయి. దీనికి ఆజ్యం పోసింది ప్రతిపక్షనాయకుడు అయిన రాహుల్ గాంధీ. మహారాష్ట్రలోనూ ఇదే ఆరోపణలను రాహుల్ చేశాడు. ఇప్పుడు కొత్తగా కర్ణాటకలోనూ అదే విధంగా ప్రచారం జరిగిందని మొదలుపెట్టాడు. త్వరలో జరుగబోయే బీహార్ ఎన్నికల గురించి ఓ పెద్ద పథకమే వేసినట్టుగా అర్థమవుతోంది.
నిర్ధిష్ట ఆరోపణలు చేసినప్పుడు దానికి తగ్గ ఆధారాలు ఉండాలి. సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన తర్వాత కూడా.. సుప్రీం చెప్పినా కూడా రాహుల్ వినకుండా ప్రచారం కోసం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
తేజస్వి యాదవ్ అసలు ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించేవరకూ రాహుల్ ఆరోపణలు వెళ్లాయి. దాన్ని పట్టుకొని ఆర్జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ.. ‘ఈసీ బంగ్లాదేశ్ లోలాగానే బూటకం అంటూ’ ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ లో ఫేక్ ఎలక్షన్స్ అని నిరూపించి ఆమెను గద్దెదించారు. బంగ్లాదేశ్ పరిస్థితులు వేరు.. ఇండియాలో పరిస్థితులు వేరు.. సోరోస్ ప్రోద్బలంతోనే దేశంలో ఎన్నికలు ఫేక్ అనే కుట్ర జరుగుతోందని అర్థమవుతోంది. మోడీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఇలా కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు ప్రపంచ వ్యాప్త కుట్రలో భాగమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
