అమెరికాలో నిన్న ఓ వింత సంఘటన జరిగింది. భారత్ లో లంచాలు తీసుకున్నారని.. అమెరికాలో అదానీ కంపెనీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 265 మిలియన్ డాలర్లు భారత్ లో ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చేశాడట గౌతం అదానీ. దాదాపు 2200 కోట్లకు పైగా లంచం ఇచ్చాడట. ఎక్కడ లంచాలు ఇచ్చారంటే రాష్ట్రాలకు ఇచ్చాడట..
ఒడిషా, చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, జమ్మూకశ్మీర్ లకు ఈ లంచాలు ఇచ్చాడట.. ఈ 2200 కోట్ల లంచాల్లో ఏపీకే ఎక్కువ ఇచ్చాడట..సింహభాగం ఆంధ్రప్రదేశ్ అధికారులకే ఎక్కువ ఇచ్చాడట. అదే సమయంలో గౌతం అదానీ వచ్చి జగన్ ను కలిశాడు. సోలార్ పవార్ అగ్రిమెంట్ కుదరడం చూస్తే దానికి ఆధారం ఇదేనని అర్థమవుతోంది. 220 మిలియన్లు కేవలం ఒకే వ్యక్తికి ఆంధ్రాలో ఇచ్చారట.. 1900 కోట్లకు పైగా కేవలం జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చినట్టుగా ఆరోపణ..
అమెరికాలో బ్లూక్లిన్ అటార్నీ జనరల్ ఈ ఆరోపణలు చేశారు. ఆయన కోర్టు ముందు ప్రవేశపెట్టాడు. చార్జిషీట్ లో ఈ ఆరోపణలు చేశారు. అమెరికాలో ఏం లంచాలు ఇవ్వలేదని.. భారత్ లో లంచాలు ఇచ్చాడట..
అదానీ భారత్ లో ఇచ్చిన లంచాలకు అమెరికాలో అరెస్ట్ వారెంట్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.