https://oktelugu.com/

Araku: తక్కువ ఖర్చుతో అరకు అందాలను చూసి వద్దామా?

వింటర్ సీజన్‌లో చాలా మంది ఏపీలోని అరకు వెళ్లడానికి బాగా ఇష్టపడుతుంటారు. కాఫీ తోటలు, కొండల మధ్య తెల్లని మంచు చూడటానికి భారీగా జనం వెళ్తుంటారు. అయితే ఏపీలో ఉండే ఈ అరకు అందాలను తక్కువ ఖర్చుతో చూడటం ఎలాగో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2024 / 05:13 AM IST

    araku valley

    Follow us on

    Araku: ట్రావెలింగ్ చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ వ్యక్తిగత కారణాలు, డబ్బులు, సమయం లేకపోవడం వల్ల ఎక్కువగా ట్రావెల్ చేయలేరు. ట్రావెల్ చేయడం వల్ల కొందరికి హాయిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటారు. డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా విముక్తి చెందాలని, గతంలో జరిగిన విషయాలను మర్చిపోవాలని కొందరు ఎక్కువగా కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే చాలా మంది వింటర్ సీజన్‌లో ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే శీతాకాలంలో కొన్ని ప్రదేశాలు చూడటానికి చాలా మంచిగా ఉంటాయి. వీటిని చూస్తే మనస్సులో ఎంత బాధ ఉన్న కూడా మర్చిపోతారు. శీతాకాలంలో తెల్లని మంచుతో కొన్ని ప్రదేశాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మన ఇండియాలో చాలా ప్రదేశాలు ఉన్నాయి. చల్లని వాతావరణంలో పర్వతాలను చూడాలని అనుకుంటారు. అయితే వింటర్ సీజన్‌లో చాలా మంది ఏపీలోని అరకు వెళ్లడానికి బాగా ఇష్టపడుతుంటారు. కాఫీ తోటలు, కొండల మధ్య తెల్లని మంచు చూడటానికి భారీగా జనం వెళ్తుంటారు. అయితే ఏపీలో ఉండే ఈ అరకు అందాలను తక్కువ ఖర్చుతో చూడటం ఎలాగో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

    అరకు హిల్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉండే రమణీయమైన ప్రదేశాలు టూరిస్ట్‌లను మంత్ర ముగ్ధులను చేస్తాయి. అయితే ఈ అరకు హిల్ స్టేషన్‌కు వెళ్లాలనుకుంటే విశాఖపట్నం రైల్వేస్టేషన్ చేరుకోవాలి. ఇక్కడి నుంచి అరకు హిల్ స్టేషన్‌కి ఉదయం, రాత్రి ట్రైన్ ఉంటుంది. ఉదయం 6:45, రాత్రి 9:20కి ట్రైన్ ఉంటుంది. దీనికి కేవలం రూ.60 టికెట్ మాత్రమే ఉంటుంది. అయితే విశాఖ పట్నం నుంచి బస్సు సౌకర్యం, టూరిస్ట్ ప్యాకేజీలు కూడా ఉంటాయి. మీకు తక్కువ ఖర్చుతో కావాలనుకుంటే ఈ ట్రైన్‌కి వెళ్లడం బెటర్. అరకులో రూ.500 నుంచి గదులు ప్రారంభం అవుతాయి. అలాగే టెంట్‌లు కూడా ఉంటాయి. ట్రైన్‌కి వెళ్తే ఇంకో బెనిఫిట్ ఏంటంటే.. చుట్టూ అందాలను చూడవచ్చు. పచ్చని పర్వతాల మధ్య మంచు అందాలు అలా చూస్తూ వెళ్తే.. ఆ ఆనందం అసలు చెప్పలేనిది. వింటర్ సీజన్‌లో తప్పకుండా అరకు హిల్ స్టేషన్ చూడాల్సిందే. అయితే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల్లో అరకు అందాలు చూడటానికి చాలా మనోహరంగా ఉంటాయి.

    అరకు హిల్ స్టేషన్‌లో చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా బొర్రా గుహలు చూడాల్సిందే. దాదాపుగా పది లక్షల క్రితం ఏర్పడిన ఈ గుహలను చూడటానికి టూరిస్టులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. మీరు ట్రైన్‌కి అరకు వెళ్తే మధ్యలో బొర్రా గుహలు స్టేషన్ ఉంటుంది. ఇక్కడ దిగి చూసుకుని అరకు వెళ్లవచ్చు. దీనికి దగ్గరలో కటిక, తాటిగూడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతం, కాఫీ తోటలు ఉంటాయి. అయితే అరకు హిల్ స్టేషన్‌కి దగ్గరలో లంబసింగి, వనజంగి వంటి ప్లేస్‌లు కూడా ఉన్నాయి. ఈ వింటర్ సీజన్‌లో పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు.