AP districts formation: ఆంధ్రా జిల్లాల పుట్టుపూర్వోత్తరాలు మార్పులు, చేర్పులపై చర్చించాం. భాష ప్రయుక్త రాష్ట్రంగా ఒడియా ప్రాంతాలను ఏర్పాటు చేశారు. మద్రాస్ ప్రావిన్సులోని ఒడియా ప్రాంతాలను 1936లో ఒరిస్సాను భాష ప్రయుక్త రాష్ట్రంగా మొట్టమొదటగా బ్రిటీష్ వారు ఏర్పాటు చేశారు.
గోదావరి జిల్లా 1802ను ఏర్పాటు చేశారు. 1859 లో గోదావరి జిల్లాను విస్తరించారు. కాకినాడ హెడ్ క్వార్టర్స్ తో రాజమండ్రి, నరసాపురం సబ్ డివిజన్లుగా , కృష్ణాకు హెడ్ క్వార్టర్ గా మచిలీపట్నం హెడ్ క్వార్టరుగా ఏర్పాటు చేశారు.
ఇక 1874 భద్రాచలం తాలూకా చేరింది. 1925లో తూర్పు గోదావరి పశ్చిమ గోదోవరి జిల్లాలుగా విభజించారు. తూర్పుగోదావరికి కాకినాడ, పశ్చిమగోదావరికి ఏలూరును హెడ్ క్వార్టర్ చేశారు.
1959లో భద్రాచలం రెవెన్యూ డివిజన్ ను ఖమ్మం జిల్లాలో విలీనం చేశారు. 2014లో 7 మండలాలు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రకు బదలాయింపు చేశారు.
సరిదిద్దిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల పుట్టుపూర్వోత్తరాలు మరోసారి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
