రాజమౌళి.. తనను అట జైల్లో పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వారు మాట్లాడుతున్నారు. అసలు ఇంత అసహనం హిందుత్వాన్ని నమ్మినవారిలో ఉందా? వీరసావర్కర్ లాంటినేత హిందుత్వాన్ని పరిచయం చేశాడు. అలాంటి వారు హిందుత్వాన్ని ఉపయోగించుకొని ఇలాంటి విశృంఖలత్వం చూసి ఉంటే వీరసావర్కర్ ఆనాడే ఈ హిందుత్వ ఎజెండాను బయటకు తీసేవాడు కాదు..
స్వాతంత్ర్య యోధుడు అయిన సావర్కర్ గోవును పూజించడాన్ని అవహేళన చేశాడు. ఆర్ఎస్ఎస్ అయితే దేశంలోని అంతా హిందువులే అన్నాడు. హిందువులకే చోటు అన్నాడు. నయా సుడో హిందూ వాదులు మాట్లాడేది చూస్తే అసహ్యం వేస్తుంది. వాళ్లు మాట్లాడేది ఏ పద్ధతిలో క్లిక్ చేస్తామో అర్థంకాదు.
రాజమౌళిపై హిందుత్వవాదులు మండిపడుతున్నారు. ‘నేను దేవుడిని నమ్మను అని.. వాళ్ల నాన్నకు దేవుడు అంటే ఇష్టం అని.. నాకు మాత్రం దేవుడు సహకరించడం లేదు’ అంటూ ఫస్ట్రేషన్ తో మాట్లాడాడు.. నాకు చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతాలు అంటే ఇష్టమని..కానీ నేను నాస్తికుడిని అంటూ చెప్పుకొచ్చాడు.
ఇస్లామిక్ వాదులకీ.. ఈ నయా సుడొ హిందుత్వ వాదులకీ తేడా ఏంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.