https://oktelugu.com/

KGF : ప్రపంచ కమ్మ మహాసభలు మేలు జరిగాయా, కీడు జరిగాయా?

ఈ టైంలో ఈ సమావేశాలు జరగడం ఈ టైంలో సందర్భం కాదా? ప్రపంచ కమ్మ మహాసభలు మేలు జరిగాయా, కీడు జరిగాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2024 / 04:31 PM IST

    KGF : ఇటీవల జులై 21,22వ తేదీల్లో రెండు రోజులు హైటెక్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ‘ప్రపంచ కమ్మ మహాసభలు’ జరిగాయి. విశేషం ఏంటంటే.. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు గైర్హాజరయ్యారు. నిజానికి కమ్మ సామాజికవర్గానికి చెందిన ఏకైక సీఎం చంద్రబాబు మాత్రమే. కాబట్టి రావాల్సిన బాబు ఎందుకు గైర్హాజరయ్యారు.అసలు బాబు ఎందుకు రాలేదు.. సమావేశం ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం.

    కేజీఎఫ్ అనేది ‘జెట్టి కుసుమకుమార్’ పెట్టిన సంస్థ. ఈ కుసుమ కుమార్ ఎవరని తెలుసుకుంటే.. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశాడు. రేవంత్ రెడ్డికి జిగ్రీ దోస్త్. ఇద్దరూ క్లాస్ మేట్స్, బెంచ్ మేట్స్,. ఇళ్లు, ఆఫీసులు పక్కపక్కనే.. మూడు దశాబ్ధాలుగా వీరిద్దరూ సన్నిహితులు..

    ఇటీవల ఖమ్మం ఎంపీ సీటు కోసం ఈయన బాగా ట్రై చేశాడు. ఇది కుసుమ కుమార్ చరిత్ర. ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న సందేహాలు తెలుసుకుందాం..

    చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. ఈ టైంలో ఈ సమావేశాలు జరగడం ఈ టైంలో సందర్భం కాదా? ప్రపంచ కమ్మ మహాసభలు మేలు జరిగాయా, కీడు జరిగాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.