https://oktelugu.com/

Haryana Election Results : హర్యానా ఫలితం ఇండీ కూటమికి కోలుకోలేని దెబ్బ

Haryana Election Results: హర్యానా ఫలితం ఇండీ కూటమికి కోలుకోలేని దెబ్బ

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2024 / 09:59 PM IST

    రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఉత్కంఠకు తెరపడింది. జమ్మూ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు దగ్గరగా వచ్చాయి. హర్యానాలో ఎవ్వరూ ఊహించని పద్ధతుల్లో ఫలితం వచ్చింది. జమ్మూలో ఎన్సీ, బీజేపీ మధ్యనే బిగ్ ఫైట్ జరిగింది. మూడో స్థానంలో కాంగ్రెస్ ఎన్సీ మద్దతుతో నిలిచింది. జమ్మూలో కాంగ్రెస్ కేవలం 6 సీట్లు గెలిచింది.. 20 శాతం స్ట్రైక్ రేట్. ఇక ఎన్సీ 56కు పోటీచేసి 43 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ తో పొత్తు వేస్ట్ అని ఎన్సీ కి అర్థమైంది.

    బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇదే.. ఆర్జేడీ గెలిచింది.. కాంగ్రెస్ ఓడిపోయింది. ముస్లిం పోలరైజ్ అంతా నేషనల్ కాన్ఫరెన్స్ వైపు సాగింది. హర్యానాలో అన్ని సర్వేలు ఈసారి బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు. కాంగ్రెస్ కు వేవ్ ఉందని అన్నీ హోరెత్తించాయి. టీవీలన్నీ హర్యానాలో కాంగ్రెస్ నే గెలుస్తాయని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర, జార్ఖండ్ కూడా బీజేపీ ఓడిపోతాయని ఘంఠా బజాయించాయి. కిసాన్, జవాన్, పహిల్వాన్ సహా అంతా బీజేపీకి వ్యతిరేకం అని కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు.

    పోస్టల్ బ్యాలెట్ లో మొదట కాంగ్రెస్ కు ఆధిక్యం లభించింది. తర్వాత ఈవీఎంలు చెక్ చేస్తుంటే మెల్లగా బీజేపీ ఆధిక్యం పెరుగుతూ పోయింది.

    హర్యానా ఫలితం ఇండీ కూటమికి కోలుకోలేని దెబ్బ అంటూ ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.