Bank Street in Amaravati : అమరావతి రాజధానిలో నిన్న ఒక ముఖ్య సంఘటన జరిగింది. 15 ప్రాంతీయ బ్యాంకు కార్యాలయాలకు ఒకే సారి శంకుస్థాపన జరిగింది. దాన్ని ‘బ్యాంక్’ స్ట్రీట్ గా నామకరణం చేశారు. అందరూ బ్యాంక్ స్ట్రీట్ గా అంటున్నారు. అదే పాపులర్ అయిపోయింది.
ఇప్పటికే ఒక బ్యాంక్ స్ట్రీట్ గా ఉంది. పేరుగానే అది ఉంది. మన హైదరాబాద్ లోనే కోటి ఆంధ్ర బ్యాంక్ నుంచి మొదలుకొని అబిడ్స్ ముందు వరకూ కొన్ని బ్యాంకులున్నాయి. కోటి ఆంధ్ర బ్యాంక్ అంటే అక్కడ చాలా పాపులర్. మూడు నాలుగు దశబ్ధాలుగా ఇది ఫేమస్ గా మారింది. మూడు నాలుగు బ్యాంకులకే బ్యాంక్ స్ట్రీట్ గా పేరొచ్చింది.
అమరావతిలో 15 బ్యాంకుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. జాతీయ బ్యాంకులు, నాబార్డ్, ప్రాంతీయ, గ్రామీణ, కోఆపరేటివ్, ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కలిసి ఇన్ని బ్యాంకుల కార్యాలయలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా ఇటువంటి పరిణామం జరగలేదు.
ఈ శంకుస్థాపనలో కేంద్ర ఆర్థిక మంత్రితోపాటు అన్ని బ్యాంకుల చైర్మన్ లు, మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొనడం విశేషం. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా రేర్ గా చెప్పొచ్చు.
ఒకేచోట అన్ని బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు అమరావతి రాజధాని ప్రత్యేకత.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
