YS Sharmila : షర్మిలను నమ్ముకున్న అనేకమంది షాక్ నుంచి తేరుకోలా

ఆంధ్ర ఆడకూతురు కావడం వల్ల ఆమెకు తెలంగాణలో ఆదరణ రాలేదు. కానీ ఇలానే పనిచేసుకుంటూ పోతే ఆమెకు అంతో ఇంతో గుర్తింపు వచ్చింది. ఆమె విన్నర్ కాకపోయినా కూడా గణనీయమైన ఓట్ల శాతం వచ్చి ఉండేది.

Written By: NARESH, Updated On : September 1, 2023 1:39 pm

YS Sharmila : వైఎస్ షర్మిల.. ఈవిడ తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఒక మహిళగా మూడున్నర వేల కి.మీలు పాదయాత్ర చేసింది. ఇందుకు ఆవిడను హర్షించాలి. రాజకీయాలు వేరు. కానీ ఈమెలోని పాజిటివ్ పాథ్ ను మనం హర్షించాలి. కేసీఆర్ కు వ్యతిరేకంగా షర్మిల పోరాటం నిజంగా అభినందించదగ్గదే. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఒక సెక్షన్ ఆమెను ఆదరించారు. ఆవిడ మీటింగ్ లకు స్పందన కూడా బాగానే వచ్చింది. అవి ఓట్లకు టర్న్ అవుతుందా? లేదా? అన్నది పక్కనపెడితే షర్మిల కోసం ప్రజలు రావడం మాత్రం జరిగింది.

ముఖ్యంగా కొన్ని జిల్లాలు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి దక్షిణ తెలంగాణలో మీటింగ్ లకు జనాలు బాగా వచ్చారు. అటువంటి ఆవిడ ఇప్పుడు కాడి ఎత్తేసింది. రాజకీయాల్లో కావాల్సిందే ఓపిక. ఇంత పాదయాత్ర చేసిన షర్మిల ఇవ్వాల కాకపోతే వచ్చే ఎన్నికల్లోనైనా ఆమెకు అంతో ఇంతో సీట్లు వచ్చేవి.

ఆంధ్ర ఆడకూతురు కావడం వల్ల ఆమెకు తెలంగాణలో ఆదరణ రాలేదు. కానీ ఇలానే పనిచేసుకుంటూ పోతే ఆమెకు అంతో ఇంతో గుర్తింపు వచ్చింది. ఆమె విన్నర్ కాకపోయినా కూడా గణనీయమైన ఓట్ల శాతం వచ్చి ఉండేది.

మూడేళ్లుగా ఆమె వెంట నడిచిన కార్యకర్తలు, నేతలను ఇప్పుడు గంగలో కలిపేసి తన అన్న జగన్ ను జైలుకు పంపిన సోనియాను కలిసి కాంగ్రెస్ లో విలీనానికి ప్రతిపాదనలు చేస్తుండడంతో ఎవరూ జీర్ణించుకోవడం లేదు.

షర్మిలను నమ్ముకున్న అనేకమంది షాక్ నుంచి తేరుకోలేదు. షర్మిల రాజకీయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.