Samantha: కోటి రూపాయలు వదులుకున్న సమంత… మనిషి చాలా పర్ఫెక్ట్ అబ్బా!

సమంతకు మయోసైటిస్ సోకిన నేపథ్యంలో ఖుషి చిత్ర విడుదల ముందు అమెరికా వెళ్ళింది. దీంతో సమంత ప్రమోషన్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. అగ్రిమెంట్ ప్రకారం సమంత ప్రమోషన్స్ చేయలేదు.

Written By: Raj Shekar, Updated On : September 1, 2023 1:13 pm

Samantha

Follow us on

Samantha: హీరోయిన్ సమంత కోటి రూపాయలు వదిలేసిందట. దీనికి సంబందించిన ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. సమంత చాలా పర్ఫెక్ట్ అని పలువురు కొనియాడుతున్నారు. విషయంలోకి వెళితే… సమంత లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ చిత్రానికి సమంత రూ. 4 నుండి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. చిత్ర ప్రమోషన్స్ తో కలిపి ఈ మొత్తం తీసుకున్నారట. అయితే సమంత పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొనలేదు.

సమంతకు మయోసైటిస్ సోకిన నేపథ్యంలో ఖుషి చిత్ర విడుదల ముందు అమెరికా వెళ్ళింది. దీంతో సమంత ప్రమోషన్స్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది. అగ్రిమెంట్ ప్రకారం సమంత ప్రమోషన్స్ చేయలేదు. ఈ క్రమంలో ఒక కోటి రూపాయలు ఖుషి చిత్ర నిర్మాతలకు తిరిగి ఇచ్చేసిందని టాక్. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. సమంత కోటి రూపాయలు తృణప్రాయంగా వదిలేసింది. ఆమె మాటంటే మాటే. చాలా ఖచ్చితంగా ఉంటారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఖుషి చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఖుషి చిత్ర ఓపెనింగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా యూఎస్ లో ప్రీమియర్ వసూళ్లలో ఖుషి దూసుకుపోతుంది. ఖుషి మూవీలో హీరోగా విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందించారు.

సినిమాలో విజయ్ దేవరకొండ-సమంత కెమిస్ట్రీ అదిరిందన్న మాట వినిపిస్తోంది. అలాగే సాంగ్స్ సినిమాకు హైలెట్ అంటున్నారు. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండకు హిట్ పడిందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీకెండ్ ముగిస్తే కానీ ఖుషి ఈ స్థాయి విజయం సాధించిందో అర్థమవుతుంది. సమంత అమెరికాలోనే ఉంది. ఖుషి సక్సెస్ ఆమె అక్కడ ఉంది ఎంజాయ్ చేస్తుంది.