Political satire : నిజం ఒక అడుగు వేసే లోపు.. అబద్ధం ప్రపంచమంతా చుట్టి వస్తుందట..’ మన టీడీపీ మీడియాతోపాటు ప్రముఖ న్యూస్ చానెల్ చేసే ప్రచారం లాగా.. అవును.. కృష్ణా నది కరకట్టను కబ్జా చేసి గెస్ట్ హౌస్ కట్టుకొని అక్రమంగా చంద్రబాబు నివసిస్తున్నాడని జగన్ దాన్ని అటాచ్ చేశాడు. దాన్ని ప్రశ్నించడం పోయి వెనకేసుకొస్తోంది మన పచ్చమీడియా.. మరీ ముఖ్యంగా జగన్ అంటేనే చాలు బట్టలు చింపుకొని భరతనాట్యం వేసే మన ఆ జర్నలిస్ట్ మాటలకు, చేతలకు పొంతన లేకుండా మాట్లాడుతాడు. అసలు మాట్లాడేది కరెక్టా? రాంగ్ నా అని కూడా చూడడు.. నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యాడు.
చంద్రబాబు అంటే చాలు ఈ ప్రముఖ జర్నలిస్ట్ అన్నీ మీదేసుకుంటాడు. బాబు గారంటే అంత అభిమానం మరీ.. అసలు కేంద్రం బ్యాన్ చేసిన టెలిగ్రాంలను కూడా చంద్రబాబు కోసం సృష్టించగల ఘనాపాఠీ మన జర్నలిస్ట్. అవును.. తాజాగా టీవీ న్యూస్ చానెల్ లో చర్చ సందర్భంగా జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాయి.
జర్నలిస్ట్ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అద్దెకుంటున్న ఇల్లు.. లేదా ఫ్రీగా ఉంటున్న ఇల్లు.. అటాచ్ చేసి రోడ్డున పడేస్తారా? ఏ ఒక మాజీ సీఎంకు చాలా మంది ఇల్లు ఇస్తారు.. ఇవాళ చంద్రబాబును ఎప్పుడైతే ఖాళీ చేయించమన్నారో.. 2వేల మంది మా ఇంట్లో ఉండండి అంటే మా ఇంట్లో ఉండండి అంటూ టెలిగ్రాంలు పంపారట.. బహుశా ఈ విషయం వైసీపీకి తెలియదేమో’ అంటూ హాట్ కామెంట్ చేశారు.
జర్నలిస్ట్ చేసిన కామెంట్స్ ను పక్కనపెడితే.. అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే చంద్రబాబును మా ఇంట్లోకి రమ్మని టెలిగ్రాంలు కుప్పలుగా రాస్తున్నారని ఆ జర్నలిస్ట్ అంటున్నారు. నిజానికి కేంద్రం పదేళ్ళ క్రితం నిలిపివేసిన టెలిగ్రాంని నిన్న బాబోరు కోసం రెండు వేలమంది వాడారు అని ఆయన చెబుతున్నాడు.దీంతో ఈ టెలిగ్రాం బంద్ అయిన విషయాన్ని లేవనెత్తుతూ సోషల్ మీడియాలో ‘అరే వో సాంబా.. నమ్మరేంట్రా బాబూ..!!’ అంటూ గెలిచేస్తున్నారు.
https://twitter.com/PoliticalPunch9/status/1658330947518083072?s=20
దాదాపు 160 ఏళ్లుగా కొనసాగుతున్న టెలిగ్రామ్ ను 2013 జులై 15 నుంచి మన బీఎస్ఎన్ఎల్ సంస్థ సర్వీసులను నిలిపివేసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇక సెల్ ఫోన్ల రాకతో దాంతో పనిలేదు.. వాడకం లేదని కేంద్రం నిలిపివేసింది. అలాంటి రద్దయిన టెలిగ్రాంలను రెండు వేల మంది చంద్రబాబుకు రాశారని జర్నలిస్ట్ తన ఆవాజ్య ప్రేమతో చాటిచెబుతున్నాడు. జనాల చెవిలో పిచ్చిపూలు పెడుతున్నాడు. ఈ అవాస్తవాలను జనాలు ఎప్పటికీ గమనిస్తూనే ఉంటారు.జనంలో, మీడియా సర్కిల్స్ లో అంత పాపులర్ సెలబ్రెటీకి కనీసం టెలిగ్రామ్ బంద్ అయిన విషయం కూడా అవగాహన లేదా? మరి అంత పెద్ద చానెల్ ను ఎలా నడిపిస్తున్నావయ్యా అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.