WPL 2024 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు తలబడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు బెంగళూరు బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌట్ అయింది.. గత సీజన్లో ఫైనల్ వెళ్లిన ఢిల్లీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి 131 పరుగులు చేసింది. కానీ ఈసారి పూర్తిస్థాయి ఓవర్లు ఆడకుండానే కేవలం 113 పరుగులకే ప్యాకప్ చెప్పేసింది. బెంగళూరు జట్టు ఢిల్లీని 113 పరుగులకే ఆలౌట్ చేయడంతో.. బెంగళూరు పురుషుల జట్టు హర్షం వ్యక్తం చేస్తోంది. ట్విట్టర్ వేదికగా ఆ జట్టు బౌలర్లను ఆకాశానికి ఎత్తేస్తోంది.
Moli’s Momentum shifting spell.
From Miyan to Moli, from IPL to WPL… THE MAGIC HAS BEEN EVIDENT, 12th Man Army? #PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 #WPLFinal #DCvRCB pic.twitter.com/8qdPktkFWm
— Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024
ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు తొలి వికెట్ కు 64 పరుగులు జోడించింది. ఆ తర్వాత మొలి నెక్స్ 7 ఓవర్లో మూడు కీలక వికెట్లు తీయడంతో ఢిల్లీ జట్టు తడబడింది. ఆ తర్వాత శ్రేయాంక నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ జట్టును కోలుకోకుండా చేసింది. శోభన రెండు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటింది. దీంతో ఢిల్లీ జట్టు 18.3 ఓవర్లకు 113 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. చివరి ఆరు వికెట్లను 39 పరుగుల వ్యవధిలో కోల్పోయిందంటే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
Economical and effective!
Asha takes her tally to 12 wickets in this WPL #PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 #WPLFinal #DCvRCB pic.twitter.com/2cRPeWe6wu
— Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024
మొలి నెక్స్ 4 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది.. శ్రేయాంక 3.3 ఓవర్లు వేసి, 12 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు తీసింది. శోభన మూడు ఓవర్లు వేసి, 14 పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు తీసింది. తమ మహిళల జట్టు క్రీడాకారిణులు ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడంతో.. బెంగళూరు పురుషుల జట్టు ఉబ్బి తబ్బిబవుతోంది. వారు మా ఆణిముత్యాలు అంటూ ట్విట్టర్ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టింది. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈసాలా కప్ నమదే అంటూ బెంగళూరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
4 wickets and didn’t even get to bowl her 4 overs
She finishes off On A Hattrick #PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 #WPLFinal #DCvRCB pic.twitter.com/C1Fi3h8LGV
— Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024