Honey: తేనె ఆరోగ్యానికి చాలా మంచి. ఎన్నో వేళ సంవత్సరాల నుంచి ఈ తేనె ఉంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి, చర్మం కాంతివంతంగా ఉండటానికి ఈ తేనె సాయపడుతుంది. దీన్ని తేనెపట్టు నుంచి తీస్తారు. అయితే ఈరోజుల్లో చాలా మంది ఈ తేనెను కల్తీ చేస్తున్నారు. వీటివల్ల తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడవుతుంది. అదే సహజమై తేనె అయితే తప్పకుండా నిల్వ ఉంటుంది. అయితే ప్రపంచంలో ప్రతీ ఒక్కదానికి గడువు తేదీ ఉంటుంది. మనుషులు, జంతువులు నుంచి మనం డైలీ తినే బియ్యం, కూరలు ఇలా ప్రతీ దానికి ఉంటుంది. కానీ ఒక్క తేనెకి మాత్రం అసలు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. అసలు తేనెకి ఎందుకు గడువు తేదీ ఉండదు. మిగతా పదార్థాలకు ఉన్నప్పుడు తేనెకి లేకపోవడానికి కారణం ఏంటో మరి పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
తేనె సహజంగా దొరుకుతుంది. అలాగే మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది ఆరోగ్య ప్రయోజనాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే తేనె ఎక్స్‌పైరీ కాకపోవడానికి ఓ కారణం ఉంది. ఇందులో 17 శాతం నీరు ఉంటుంది. ఇది తేనె చెడిపోకుండా చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇందులో తక్కువగా నీటి శాతం ఉండటం వల్ల ఇది బ్యాక్టీరియాను నిర్జలీకరణం చేస్తుంది. దీనివల్ల తేనె ఎప్పటికీ పాడవదు. అలాగే ఇందులో ఆమ్లత్వం కూడా 3.9 శాతం మాత్రమే ఉంటుంది. తేమను పీల్చుకునే సామర్థ్యం తేనెకు ఉండటం వల్ల దీనికి ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. ఎన్ని రోజులు, సంవత్సరాలు అయిన కూడా తేనె అలాగే ఉంటుంది. అయితే సహజ తేనె అయితే ఎప్పటికీ పాడవదు. కానీ మార్కెట్లో దొరికే కల్తీ తేనె అయితే తప్పకుండా పాడవుతుంది. రసాయనాలు కలిపి తయారు చేసిన తేనె అయితే తొందరగానే పాడవుతుంది. కొందరు తేనెలో పంచదారం పాకం వేస్తుంటారు. ఇది అయితే కొన్ని రోజులకే దెబ్బతింటుంది.
తేనెను ప్లాస్టిక్ కంటైనర్లు కాకుండా గాజు వాటిలో ఉంచితేనే స్వచ్ఛంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్ వాటిలో పెడితే తేనె నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది. దీన్ని ఒక వేళ తిన్నా కూడా శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవు. అయితే ఈ తేనెను ఎక్కువగా ఆయుర్వేదానికి వాడుతారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సాయపడతాయి. చర్మం, ఆరోగ్యం వంటి వాటికి తేనె ఉపయోగపడుతుంది. రోజూ వేడి నీటిలో తేనె కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇందులోని పోషకాలు, ఖనిజాలు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అయితే తేనెను సహజంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ రసాయనాలు ఉండే తేను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. కాబట్టి తేనెను తీసుకునే ముందు అది సహజ తేనె లేదా కల్తీ జరిగిందో లేదో తెలుసుకుని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.