Roja vs Mega Family : వదలిన బాణం.. జారిన మాట వెనక్కి తీసుకోలేం. మంత్రి కాగానే చిరంజీవి ఆశీర్వాదం కోసం వచ్చిన రోజాను మెగాస్టార్ ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. చీరా సారె పెట్టి భోజనం చేయించి పంపించారు. ఆ సమయంలో స్వయంగా రోజా చిరంజీవి కాళ్లకు మొక్కింది. ఇప్పుడు అదే నోటితో ఆయన రాజకీయాల్లో గెలవలేదని అవహేళన చేసింది. నాలుక మడతేసింది. పార్టీ కోసం.. పదవి ఇచ్చిన జగన్ కోసం నిస్వార్థ చిరుపై నిందలేసింది..

మెగా ఫ్యామిలీపై రోజా నోరుజారడాన్ని ఎవ్వరూ హర్షించడం లేదు. ఎందుకంటే ఇదే రోజా స్వయంగా చిరంజీవి ఆశీర్వాదం కోసం వచ్చి మరీ ఆయన కాళ్ల మీద పడింది. మంత్రి అయ్యానని ఆశీర్వదించమని కోరింది. అంతటి పెద్దమనిషిని పట్టుకొని ఇప్పుడు తిట్టిపోస్తుంది. రూపాయి ఖర్చు పెట్టని మెగాఫ్యామిలీని అందుకే జనాలు ఓడించారట.. అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంపాదించిన కోట్లను జనం కోసం ఖర్చు చేస్తున్నారు. సినీ కళాకారులు, పేద రైతులు, అసహయుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. వారి సంపదలో చాలా ఇలా ప్రజల కోసమే వెచ్చించారు. ఆ విషయం మరిచి వాళ్లు రూపాయి విదిల్చలేదు. అందుకే గెలవలేదని రోజా నోరు పారేసుకుంది.
అయితే ట్రోలర్స్ వదలరు కదా.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై అప్పుడు ఏం మాట్లాడింది.. ఇప్పుడు ఏం మాట్లాడుతోంది అంతా కలిపి విరుచుపడుతున్నారు. రోజాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె తప్పులపై నిలదీతలు కొనసాగుతున్నాయి. అప్పట్లో రోజాపై కేఏ పాల్ చేసిన కామెంట్ల వీడియోను ట్రోల్ చేస్తూ రోజాకు చుక్కలు చూపిస్తున్నారు. పాల్ పరుషంగా మాట్లాడిన ఆ మాటలతో ట్రోల్ చేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో రోజాపై జరుగుతున్న ట్రోల్స్ తో ఆమె నిజస్వరూపం బయటపడుతోంది. ఉతికి ఆరేసేలా ఆమె నైజాన్ని ఈ వీడియోలు బయటపెడుతున్నాయి. అలాగే కావాల్సినంత వినోదాన్ని పంచిపెడుతున్నాయి. మరి ఆ ట్రోలింగ్ వీడియో మీ కోసం కింద చూడొచ్చు.