Health Tips: ఆధునిక కాలంలో జీవన శైలి మారిపోతోంది. దీంతో పలు రకాల రోగాల బెడద ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో అధిక బరువు సమస్య కూడా వేధిస్తోంది. శారీరక శ్రమ లేకుండా పోవడంతో బరువు పెరుగుతున్నారు. ఫలితంగా జాగ్రత్తలు తీసుకుంటున్నా బరువు ముప్పు తగ్గడం లేదు. వ్యాయామం లేకపోవడం వల్ల కూడా అధిక బరువు సమస్య వస్తోంది. ఊబకాయంతో అనేక వ్యాధులకు కేంద్రంగా నిలవాల్సి వస్తోంది. బరువు అనేది మనిషికి ముప్పని తెలిసినా పట్టించుకోవడం లేదు.

అధిక బరువు మనిషి పై పెను ప్రభావం చూపుతుంది. స్థూలకాయం కారణంగా కీళ్ల నొప్పులు, కాళ్లనొప్పులు వస్తాయి. ఎముకలపై కూడా భారం పడుతుంది. బరువును నియంత్రణలో ఉంచుకోవడం మంచిది. లేకపోతే పలు రోగాలకు నిలయంగా మారుతారు. చెడు కొవ్వు పెరగడంతోనే మనం బరువు పెరుగుతాం. స్థూలకాయంతో నడిస్తే ఆయాసం వస్తుంది. పరుగెత్తడం వీలుకాదు. అధిక బరువు ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది.
జీవనశైలిలో మార్పు, క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, నిద్ర లేమి, విటమిన్ల లోం వంటి కారణాలతో అధిక బరువు పెరుగుతున్నామని తెలుసుకోవాలి. ఊబకాయంతో చిక్కులు ఎదురవుతున్నాయి. ఎన్ని మాత్రలు మింగుతున్నా ఫలితం రావడం లేదు. సమస్య మరింత తీవ్రం అవుతోంది. అధిక బరువుతో ఉన్నప్పుడు అలసట వస్తుంది. ఏ పని చేసినా తొందరగా అలసిపోతారు. ఊబకాయంతో అంతర్గత అవయవాలపై అదనపు భారం పడుతుంది. ఫలితంగా ఎక్కువ శక్తి అవసరం అవుతుంది.

వీలైనంత వరకు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నీరు బరువు పెరగడానికి కారణమవుతుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీర బరువు పెరగడం మామూలే. చెడ్డ నీరు బయటకు రాకపోవడంతో బరువు పెరుగుతారు. బరువు పెరగడం ప్రమాదకరమని తెలిసినా దాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోరు. జాగ్రత్తలు పాటించరు. ఫలితంగా జబ్బులతోనే సహవాసం చేస్తారు. ఇలా ఊబకాయం సమస్య ఎంతలా బాధిస్తుందంటే దాంతో మనకు సవాలక్ష సమస్యలు ఎదురు కావచ్చు.
అధిక బరువు ఉన్నవారు నడిచేటప్పుడు తొడలు రాక్కుపోతాయి. తొడలో పేరుకుపోయిన కొవ్వుతో సమస్యలు వస్తాయి. ఇది మీ కాళ్లను వెడల్పుగా చేసి నడిచేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు ముప్పు మనల్ని వేధిస్తుంది. దీంతో బరువును తగ్గించుకునేందుకు డైట్ మార్చుకోవాలి. అప్పుడే మనకు అనుకూలంగా మారితే సమస్యలు మన దరిచేరవు.